Weather Alert: మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వడగాలులే
దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 478 మండలాల్లో వడగాల్లులు వీస్తున్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాలో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 478 మండలాల్లో వడగాల్లులు వీస్తున్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాలో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదయ్యో అవకాశం ఉందని పేర్కొంది. రేపట్నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జూన్ 19 నుంచి 21 వరకు కర్ణాటక, తమిళనాడు,కేరళ, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది
ఇదిలా ఉండగా తెలంగాణలో కూడా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నిర్మల్, భూపాపల్లి, వరంగల్ సహా పలు జిల్లాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


