Konaseema Floods: వరద ముంపు ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు.. లంక గ్రామాల్లో ఆహార పొట్లాల కోసం కొట్లాట
పెదపట్నం లంక గ్రామంలో గత ఆరు రోజులుగా కనీసం మంచినీళ్లు అందక ఆకలితో అలమటిస్తున్నామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కోసం ఆహారం పట్టుకుని వెళ్ళినప్పుడు .. ఆహార పొట్లాల కోసం వరద బాధితులు కొట్టుకున్న.. హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
Konaseema Floods: కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. గోదావరి నదిలో (Godavari River) నీరు తగ్గడంతో పలు గ్రామాల్లో వరద 2 అడుగులు మేర తగ్గింది. అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అయినవిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఏకంగా మామిడి కుదురు మండలంలోని లంక గ్రామ వరద బాధితులు భోజనాల కోసం కోట్లాటకు దిగారు కూడా. నాకంటే నాకంటూ భోజనం పొట్లాలు లాక్కున్న హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఆకలితో అలమస్తున్న బాధితుల తీరు.. చూపరులకు ఆవేదన కలిగిస్తున్నాయి.పెదపట్నం లంక గ్రామంలో వరద బాధితులకు గత ఆరు రోజులుగా కనీసం మంచినీళ్లు అందక ఆకలితో అలమటిస్తున్నారని తెలుస్తోంది. A1 సేవా సమితి అధ్యక్షుడు చెల్లి బోయిన శ్రీనివాసు సంస్థలు.. బాధితుల కోసం ఆహారం పట్టుకుని వెళ్ళినప్పుడు .. ఆహార పొట్లాల కోసం వరద బాధితులు కొట్టుకున్నారు. కొట్లాడుతున్న బాధితులను ఫైర్ సిబ్బంది, అధికారులు విడదీశారు. బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
గత వారం రోజులగా వరద ముంపులోనే పీక లోతు నీటిలో ఆకలితో అలమటిస్తున్నామని.. మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని లంక గ్రామాల్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందన సరిగా లేదంటూ అధికారులను తీరును వరద బాధితులు తప్పుపడుతున్నారు. తక్షణ మమ్మల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్న సమయానికి కనీసం భోజనం, తాగునీరు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..