Andhra Pradesh: శవాన్ని బైక్ పై తరలించి మానవత్వం చాటుకున్న హెల్పింగ్ సోల్జర్స్..!
నా అనే వాళ్లు ఎవరూ లేని వాళ్లు చనిపోతే మేమున్నామంటూ వారు మందుకు వస్తారు. వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏడుగురుతో ప్రారంభమైన వీరి ప్రస్థానం ప్రస్తుతం 120 మందికి చేరుకుంది. స్థానికుల వద్ద నుండే కాదు పోలీసులు కూడా వీరి సేవలను అర్థిస్తుంటారు.
నా అనే వాళ్లు ఎవరూ లేని వాళ్లు చనిపోతే మేమున్నామంటూ వారు మందుకు వస్తారు. వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏడుగురుతో ప్రారంభమైన వీరి ప్రస్థానం ప్రస్తుతం 120 మందికి చేరుకుంది. స్థానికుల వద్ద నుండే కాదు పోలీసులు కూడా వీరి సేవలను అర్థిస్తుంటారు. తాజాగా జరిగిన ఒక ఘటన తెనాలిలో అందరిని కలిచి వేసింది.
సోమవారం(ఆగస్ట్ 26) ఉదయం అన్నా క్యాంటిన్ వద్ద ఒక వృద్ధుడు పడి ఉన్నాడని ఇనాయతుల్లాకి ఫోన్ వచ్చింది. ఇనాయతుల్లా, శివ కల్యాణ్ ఇద్దరూ అక్కడి వెళ్లి చూసే సరికి వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతనికి నీరు తాగించి అక్కడ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా మృతుడి ఆనవాళ్లు నమోదు చేసుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించాలని ఇనాయతుల్లాకి చెప్పారు. అయితే అనాథ శవాలను తరలించే వాహనం పాడైపోవడంతో వారిద్దరూ వచ్చిన బైక్ పైనే శవాన్ని ఉంచుకుని స్మశాన వాటికకు తరలించారు. బైక్ పై వెలుతున్న వీరిని చూసిన స్థానికులు వారు చేస్తున్న సేవలు తెలుసుకొని అభినందించారు.
2017లో ఇనాయతుల్లా ఇంటి సమీపంలోనే ఒక వృద్ధురాలు ఉండేది. రోజు ఆమెకు ఆహారాన్ని అందించేవారు. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆమె చనిపోయినా కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దీంతో ఇనాయతుల్లా తన ఫ్రెండ్స్‌తో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడు వచ్చిన ఆలోచనతోనే హెల్పింగ్ సోల్జర్స్ ను స్థాపించారు. ముందుగా ఏడుగురుతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 120 మంది సభ్యులతో కొనసాగుతుంది. వీరికి విదేశాల్లో ఉండే జాస్తి మోహన రావు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. శివారు కాలనీల్లో అన్నదానాలు, నిత్యావసరాల పంపిణీ, దివ్యాంగులకు వీల్ ఛైర్లు సరఫరా ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం వీరికి ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించింది. ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి సేవ చేసేందుకు హెల్పింగ్ సోల్జర్స్ ముందుకు సాగుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..