Guntur: ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్.. ఆ తర్వాత జరిగిందిదే

ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. కొద్ది నెలల కిందట ఆమె గుంటూరు నగరంలోని గోరంట్లో నివాసం ఉంది. అక్కడున్నప్పుడు ఒకరిద్దరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ఆమె తన స్వంతూరైన తెనాలి వెళ్లిపోయింది.

Guntur: ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్.. ఆ తర్వాత జరిగిందిదే
Guntur
Follow us
T Nagaraju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2024 | 1:44 PM

ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. కొద్ది నెలల కిందట ఆమె గుంటూరు నగరంలోని గోరంట్లో నివాసం ఉంది. అక్కడున్నప్పుడు ఒకరిద్దరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ఆమె తన స్వంతూరైన తెనాలి వెళ్లిపోయింది. అప్పటి నుండి అక్కడే నివసిస్తోంది.

అయితే కొద్దిరోజుల క్రితం తెనాలిలోని ఇంటి వద్దకు కొరియర్ బాయ్ వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టగానే ఆమె హడావుడిగా బయటకు వచ్చింది. చివరికి కొరియర్ వచ్చిందని తెలసుకొని దాన్ని తీసుకొని లోపలికి వెళ్లింది. తనకు కొరియర్ చేసేవారు ఎవరా అంటూ ఆలోచిస్తూనే కవర్ ఓపెన్ చేసింది. అందులోని ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది. అశ్లీలంగా ఉన్న తన చిత్రాలను చూసుకొని షాక్ అయింది. అంతే కాదు చిత్రాలతో పాటు ఒక లెటర్ కూడా అందులో ఉంది. లెటర్‌లో ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పాస్‌వర్డ్‌లు చెప్పాలని.. లేకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులున్నాయి. దీంతో కంగారుపడిన ఆమె వెంటనే పోలీసులను సంప్రదించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ కొరియర్ ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి వచ్చిందని గుర్తించారు. అక్కడకెళ్లి విచారించి.. భరత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఎంక్వయిరీ చేయగా.. డబ్బుల కోసమే తాను ఆ పని చేసినట్లు భరత్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె గోరంట్లలో ఉన్న సమయంలో భరత్ కూడా అక్కడున్నాడు. ఈక్రమంలోనే ఆమె స్నేహితురాలి ద్వారా ఆమె ఫోటోలు సంపాదించాడు. ఇక వాటిని మార్ఫింగ్ చేసి ఆమెకే కొరియర్ చేశాడు. దీంతో భరత్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు తెనాలి టూ టౌన్ పోలీసులు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అపరిచితులకు ఎవ్వరికి ఫోటోలు, ఫోన్ నంబర్లు ఇవ్వొద్దని సిఐ సుధాకర్ చెప్పారు.