Fraud: లేని పొలాన్ని కొనుగోలు పేరుతో రూ.40 లక్షలు వసూలు చేసి బాల్య స్నేహితుడు.. అరెస్టు చేసిన పోలీసులు
Fraud: గుంటూరు జిల్లాలోని వినుకొండకు చెందిన విద్యాధరణి సురేష్, వేములూరి సురేష్ బాల్య స్నేహితులు. కొన్నేళ్ల క్రితం విద్యాధరణి సురేష్ హైదరాబాద్ (Hyderabad)..
Fraud: గుంటూరు జిల్లాలోని వినుకొండకు చెందిన విద్యాధరణి సురేష్, వేములూరి సురేష్ బాల్య స్నేహితులు. కొన్నేళ్ల క్రితం విద్యాధరణి సురేష్ హైదరాబాద్ (Hyderabad) వెళ్ళిపోయాడు. అక్కడే ఉద్యోగం (Jobs) చేస్తూ డబ్బులు (Money) సంపాదించాడు. సంపాదించిన డబ్బులతో తన సొంత ఏరియాలో పొలం కొనుగోలు చేయాలని భావించాడు. ఇదే విషయాన్ని తన బాల్య స్నేహితుడైన వేములూరి సురేష్ కు చెప్పాడు. వినుకొండ ఏరియాలో నే భూములు కొనుగోలు చేయమని 2015 నుండి 2019 మధ్యలో 41 లక్షల రూపాయలు పంపించాడు. ఆ డబ్బులు అందుకున్న వేములూరి సురేష్ వినుకొండ మండలం ఉప్పరపాలెంలో నాలుగెకరాలు, వెంకుపాలెంలో ఆరున్నర ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. వాటిని స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. డాక్యుమెంట్స్ తో పాటు పాస్ పుస్తకాలు పంపించాడు. ఈ ఏడాది డబ్బులు అవసరమైన విద్యాధరణి సురేష్ .. ఆ పొలంపై రుణం తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అవి నకిలీ డాక్యుమెంట్స్ అని వాటిపై రుణం ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న విద్యాధరణి సురేష్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వేములూరి సురేష్ తో పాటు అతనికి సహకరించిన వీఆర్ఏ చిన అచ్చయ్య సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నకిలీ రబ్బర్ స్టాంప్స్ సీజ్ చేశారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు
ఇవి కూడా చదవండి: