గ్రామ సచివాలయాల ఎఫెక్ట్: ‘మీ సేవలు’ బంద్!
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు మీ సేవ ఉద్యోగులు. ఏపీలో గ్రామ సచివాలయాల రాకతో తమ జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లకు మీ సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో.. మీసేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులకు నష్టం కలుగుతుందని.. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. […]
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు మీ సేవ ఉద్యోగులు. ఏపీలో గ్రామ సచివాలయాల రాకతో తమ జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లకు మీ సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో.. మీసేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులకు నష్టం కలుగుతుందని.. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి మీసేవ ఆపరేటర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ తమ సమ్మె కొనసాగుతుందని ఆపరేటర్లు స్పష్టం చేశారు. 11 వేల మంది ఆపరేటర్లు, 35 వేలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
కాగా.. గతంలోనే ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మీ సేవా కేంద్రాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలని ఏర్పాటు చేసింది. అయితే.. మీసేవలో అందించే.. వివిధ ధృవపత్రాలు, బిల్లు చెల్లింపులు అన్నింటినీ.. వీటి ద్వారా పొందాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా.. ఓటర్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, రేషన్ పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ సచివాలయాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. మీసేవ ఆపరేటర్ల ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో.. వారు సమ్మెకు దిగారు.