జేసీకి స్ట్రాంగ్ కౌంటర్.. పోలీస్ బూట్లు తుడిచి ముద్దాడిన మాధవ్.!

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంపీ గోరంట్ల మాధవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అంతేకాకుండా అమరులైన పోలీసుల బూట్లను తుడిచి.. ఆపై ముద్దాడిన మాధవ్.. జేసీపై విమర్శలు గుప్పించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… దేశ సమగ్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారన్నారని.. అలాంటి పోలీసులపై జేసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు గుర్తించుకోవాలంటూ ఆయనకు […]

జేసీకి స్ట్రాంగ్ కౌంటర్.. పోలీస్ బూట్లు తుడిచి ముద్దాడిన మాధవ్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2019 | 1:33 PM

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంపీ గోరంట్ల మాధవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అంతేకాకుండా అమరులైన పోలీసుల బూట్లను తుడిచి.. ఆపై ముద్దాడిన మాధవ్.. జేసీపై విమర్శలు గుప్పించారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… దేశ సమగ్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారన్నారని.. అలాంటి పోలీసులపై జేసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు గుర్తించుకోవాలంటూ ఆయనకు హితవు పలికారు. జేసీకి పునర్జన్మ ఇచ్చింది పోలీసులేనన్న ఎంపీ.. పోలీసు వ్యవస్థను కించపరచడం సరికాదన్నారు. అంతేకాకుండా జేసీ పోలీసులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు చంద్రబాబు పక్కనే ఉండి కూడా అడ్డుచెప్పకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కాగా, జేసీ పతనం ప్రారంభమైందంటూ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జేబుల్లో గంజాయి పెట్టించి గంజాయి కేసుల్లో ఇరికిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.