ఆర్టీసీ కొత్త వ్యాపారం.. మళ్లీ ఎర్రబస్సే!
తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. 2020 జనవరి 1వ తేదీ నుంచి సరుకు రవాణా రంగంలో.. సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు సరుకు రవాణా రంగంలోకి దిగాలని ప్రభుత్వం ఆలోచించిందట. ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఇప్పటికే దీనిపై అధ్యయనం మొదలు పెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రైవేట్ ఆపరేటర్లు ఎలాంటి సరుకులను, ఏ […]
తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. 2020 జనవరి 1వ తేదీ నుంచి సరుకు రవాణా రంగంలో.. సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు సరుకు రవాణా రంగంలోకి దిగాలని ప్రభుత్వం ఆలోచించిందట. ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఇప్పటికే దీనిపై అధ్యయనం మొదలు పెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రైవేట్ ఆపరేటర్లు ఎలాంటి సరుకులను, ఏ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు? కిలో మీటర్‌కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మొదలైన అంశాలపై డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
కాగా.. ఒక్కోబస్సు ఇంచుమించు 7 టన్నుల సరుకు మోసే సామర్థ్యం కలిగినదిగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి వాటిని ‘తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు’ అన్నపేరును వినియోగిస్తున్నారు. కొద్దిరోజుల తర్వాత పరిశీలించి పేరు మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నారట. అయితే.. సరుకు రవాణా బస్సులకు పూర్తిగా ఎర్ర రంగు ఉండగా.. వాహనం వెనకవైపు కొంతమేర క్రీమ్ కలర్ ఉంటుంది. అలాగే.. డ్రైవర్లకు, సిబ్బందికి డ్రెస్ కోడ్ ఉండాలని.. ఈడీలతో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నందున ఖచ్చితంగా విజయం సాధిస్తామని.. అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత ప్రయాణంతో పాటు సరైన సమయానికి చేర్చడంలో ఆర్టీసీకి మంచి పేరుంది. ఆ ఇమేజ్‌ని వాడుకుని లాభాలను గడించాలని చూస్తోంది ఆర్టీసీ.