Andhra Pradesh: సీఐడీ అధికారులపై సంచలన కామెంట్స్ చేసిన టీడీపీ నాయకురాలు..!
Andhra Pradesh: ఏపీ సీఐడీ అధికారులపై పలాస టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీష సీరియస్ కామెంట్స్ చేశారు. అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పోలీసుల తీరుపై న్యాయ..
Andhra Pradesh: ఏపీ సీఐడీ అధికారులపై పలాస టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీష సీరియస్ కామెంట్స్ చేశారు. అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నేరం చేసినట్టు ఒప్పుకోవాలని తనపై సీఐడీ అధికారులు ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించారు, పలాస టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీష. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే ఆరోపణలపై, సీఐడీ అధికారులు గౌతు శిరీషను విచారణకు పిలిచారు. దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు శిరీష. తాను చేసిన నేరం చెప్పకుండానే ఉదయం నుంచి కూర్చోబెట్టారని, కనీసం న్యాయవాదితో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వలేదని, మళ్లీ విచారణకు రావాలని చెప్పినట్టు వెల్లడించారు. అదికారుల తీరుపై పార్టీ అధిష్టానంతో చర్చించి, న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు గౌతు శిరీష.
అటు, ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు, ఏపీ సీఐడీ అధికారులు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలు రద్దు చేసినట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ ఇష్యూలో 12 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు గౌతు శిరీషతో పాటు నలుగురిని విచారించినట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు, ఏపీ సీఐడీ అధికారులు.