Andhra Pradesh: ఎవరు సీఎం అభ్యర్థి.. ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలంటున్న జనసేన.. నై నై అంటున్న బీజేపీ.. ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిట్రిక్స్..!

Andhra Pradesh: ఆ మిత్రుల్లో సీఎం అభ్యర్థి ఎవరు? పవన్‌ కల్యాణా? లేదంటే బీజేపీ వేరే ఆలోచన చేస్తుందా? ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉంది. కానీ అప్పుడే వారిద్దరి మధ్య..

Andhra Pradesh: ఎవరు సీఎం అభ్యర్థి.. ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలంటున్న జనసేన.. నై నై అంటున్న బీజేపీ.. ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిట్రిక్స్..!
Janasena
Follow us

|

Updated on: Jun 07, 2022 | 5:48 AM

Andhra Pradesh: ఆ మిత్రుల్లో సీఎం అభ్యర్థి ఎవరు? పవన్‌ కల్యాణా? లేదంటే బీజేపీ వేరే ఆలోచన చేస్తుందా? ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉంది. కానీ అప్పుడే వారిద్దరి మధ్య సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై పంచాయితీ మొదలైంది. ఇందులో జనసేన స్పీడ్‌ పెంచింది. వెంటనే ప్రకటన రావాల్సిందేనని పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది.

2024 ఎన్నికల్లో తాను తగ్గేదేలేదంటూ పవన్‌ కల్యాణ్‌ మూడు ఆప్షన్లు ఇవ్వడం ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరతీసింది. బీజేపీ, జనసేన మిత్రుల్లో ఎవరు సీఎం అభ్యర్థి అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టూర్‌లోనే పవన్‌ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ఆయన ప్రకటించాలని పట్టుబడుతోంది జనసేన. బీజేపీలో పవన్‌ కన్నా ఇమేజ్‌ ఉన్న నేత ఎవరూ లేరన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.

అయితే, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అవలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. దీనిపై టీవీ9 ప్రత్యేకంగా అడిగినా స్పందించలేదు. మరోవైపు బీజేపీతో ఉన్నా లేకపోయినా పవనే సీఎం అని జనసేన బలంగా వాదిస్తోంది. అంతేకాదు.. ఒంటరిగా వెళ్లినా గెలిచే సత్తా తమకు ఉందని గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. అయితే, ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని, ఇప్పుడు ఈ చర్చ అనవసరం అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇదంతా వైసీపీ ట్రాప్‌ అని కూడా అంటున్నారు. ఇక బీజేపీ వెర్షన్‌ ఎలా ఉన్నా పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే తమ కార్యాచరణ మరోలా ఉంటుందంటూ సున్నితంగానే వార్నింగ్‌లు ఇస్తున్నారు జనసైనికులు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ అధిష్టానం, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!