Jagananna Vidya Kanuka: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచి జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
Jagananna Vidya Kanuka: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. కరోనా లాంటి..

Jagananna Vidya Kanuka: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. కరోనా లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం జగన్ మాత్రం సంక్షేమానికే పెద్ద పీట వేశారు. ఆదాయం తగ్గుముఖం పట్టినా.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలలో జగనన్న విద్యాకానుక ఒకటి. విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
జిల్లాలోని ఆదోనిలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థిలకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఏపీలో జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. జగనన్న కానుక కిట్లలో విద్యార్థుల చదువుకు సంబంధించి అన్ని కూడా అందులోనే ఉంటాయి.
కిట్లలో ఏముంటాయి..?




జగనన్న విద్యా కానుక కిట్లలో మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ వంటివి ఉంటాయి. అలాగే బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. యూనిఫామ్ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా డబ్బులు చేస్తుంది ప్రభుత్వం.
ఈ పథకం అర్హతలు ఇవే
ఏపీ సర్కార్ అందిస్తున్న జగనన్న విద్యా కానుక కింద ప్రయోజనం పొందాలని భావించే వారికి కొన్ని అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది.ఈ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. ఉచితంగా కిట్లు అందిస్తారు. చదువుకు సంబంధించిన అవసరమైన సామాగ్రి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
