Andhra Pradesh: కోనసీమ రైతులకు గుడ్‌న్యూస్.. టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు.. రైతులకు స్పష్టమైన హామీ..!
Andhra Pradesh: కోనసీమ రైతులకు గుడ్‌న్యూస్ ఇది. క్రాప్ హాలిడేపై టీవీ9 వరుస కథనాలకు దిగొచ్చిన అధికారులు, రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
Andhra Pradesh: కోనసీమ రైతులకు గుడ్‌న్యూస్ ఇది. క్రాప్ హాలిడేపై టీవీ9 వరుస కథనాలకు దిగొచ్చిన అధికారులు, రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్నదాతలు పంటలు వేసుకోవాలని, తాము అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు కోనసీమ అధికారులు. క్రాఫ్ హాలిడే, రైతు సమస్యలపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో అమలాపురంలో సమావేశమై, చర్చించారు. రైతులు పంటలు వేసుకోవాలని సూచించారు. అయితే, అధికారుల హామీని రైతులు నమ్మట్లేదు. కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేసే వరకు క్రాప్ హాలిడే విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కోనసీమ రైతులు.
ముమ్మిడివరం మండలం అయినాపురంలో 5 గ్రామాల రైతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో క్రాప్ హాలిడే కొనసాగుతుంది. అయినాపురం, కొత్తలంక, చిన కొత్తలంక, సోమిదేవరపాలెం, చెయ్యేరు గ్రామల్లో 2500 ఎకరాల్లో తొలకరి పంట విరామం ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రాంతానికి వచ్చి, పంట పండిస్తే తమ బాధలు తెలుస్తాయని అంటున్నారు. క్రాప్ హాలిడే ప్రతిపక్షాల బలవంతం అనడం అవాస్తవమని చెబుతున్నారు అన్నదాతలు. ప్రతిపక్షాలు చెబితే ఉద్యమాలు చేసే దుస్థితిలో రైతులు లేరని, తమకు కులాలు పార్టీలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. రైతుల సమస్యలు తీరుస్తామని, పంటలు వేయండని అధికారులు చెప్పడాన్ని నమ్మట్లేదంటున్నారు. గతంలోనూ ఇదే చెప్పారని, తాము అధికారులను ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు, కోనసీమ అన్నదాతలు.