గోల్డ్‌ను తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు.. కట్ చేస్తే.. అప్రయిజర్ చేసిన పనికి దిమ్మతిరిగింది..
బ్యాంక్‌ల్లో గోల్డ్ లోన్ అప్రయిజర్స్ చేస్తున్న మోసాలతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అప్రయిజర్స్‌ను పట్టుకోవడం అటుంచితే.. బ్యాంక్ అధికారులు వారిని వదిలిపెట్టి.. ఖాతాదారులనే ఇబ్బంది పెడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా గుంటూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గోరంట్ల సెంట్రల్ బ్యాంక్‌లో బంగారు ఆభరణాలపై ఖాతాదారులు రుణాలు పొందారు. దాదాపు రెండు కోట్ల రూపాయల మేర ఖాతాదారులుకు గోల్డ్ రుణాలు ఇచ్చినట్లు బ్యాంక్ లెక్కలు చెబుతున్నాయి. కొంతమంది కస్టమర్స్ కొద్దిరోజుల క్రితమే తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందారు. అయితే రుణం తీసుకుని కొన్ని నెలలు కూడా గడవకముందే.. తీసుకున్న అప్పుకు రెండింతలు చెల్లించాలని నోటీసులు రావడంతో ఆశ్చర్యపోవడం ఖాతాదారుల వంతైంది.
నోటీసులు అందుకున్న ఖాతాదారులు బ్యాంక్ వద్దకు రాగా.. అంతకంటే మించిన షాక్‌ను బ్యాంక్ సిబ్బంది ఇచ్చారు. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు నకిలీవని సిబ్బంది చెప్పడంతో వారు మరింతగా ఆశ్చర్యపోయారు. బంగారు ఆభరణాలు తనఖా పెట్టే సమయంలో అసలైన బంగారం అని చెప్పిన సిబ్బంది కొద్దిరోజులకే అవి నకిలీవని చెప్పడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
ఈ విషయంలో అప్రయిజర్‌ను నిలదీసేందుకు ఖాతాదారులు సిద్దం కాగా అసలు అప్రయిజరే కనిపించకుండాపోయాడు. గత నాలుగు రోజులుగా ఆడిట్ నిర్వహిస్తుండటంతో నకిలీ ఆభరణాల సంగతి ఒక్కొక్కటి బయటకు వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. అయితే తమ బంగారం నకిలీదని చెప్పడంతో పాటు వెంటనే రెండింతల డబ్బులు చెల్లించాలని అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో అర్ధంకాక ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.