AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు.

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
Godadevi Sare Mahotsavam In Mandapeta
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jan 11, 2026 | 6:16 PM

Share

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాసవి అమ్మవారికి పసుపు కుంకుమ తో పాటు 160 రకాల పిండి వంటకాలను తయారు చేసి శ్రీ గోదాదేవికి సారె సమర్పించారు.

శ్రీ గోదాదేవి అమ్మ వారి సారె ను పురస్కరించుకుని మండపేట పట్టణంలో ఆర్యవైశ్య మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు సందర్బంగా దారిపొడవునా ఉన్న 11 మంది అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పిండి వంటలతో కూడిన సారె ను సమర్పించారు. ఈ 11 ఆలయాలకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆడపడుచుగా ఆయా ఆలయాల్లో కొలువై ఉన్నందున మండపేట ఊరిదేవతలు అందరికీ ఈ విధంగా పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా చేస్తుంటారు.

వీడియో చూడండి..

లోకకళ్యాణార్థం, కుటుంబాలకు ఆరోగ్య, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని అమ్మ వారిని కోరుతూ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్యవైశ్య మహిళలు.. అదే విధంగా సామూహిక గొబ్బిళ్ళు,భోగి పళ్ళు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈనెల 14వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించే గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు పూర్తి అవుతాయని, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాలు చేస్తామని ఆర్యవైశ్య ఆలయం కమిటీ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోదాదేవికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
గోదాదేవికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదలపై అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదలపై అప్డేట్
రోజూ ఉదయాన్నేవేప నీరు తాగితే శరీరంలో ఈ అద్భుతాలు..డాక్టర్లు షాక్!
రోజూ ఉదయాన్నేవేప నీరు తాగితే శరీరంలో ఈ అద్భుతాలు..డాక్టర్లు షాక్!
మీ చేతిలో అదృష్ట పుట్టుమచ్చలు.. ఈ భాగంలో ఉంటే ఏడు తరాలూ సంపన్నులే
మీ చేతిలో అదృష్ట పుట్టుమచ్చలు.. ఈ భాగంలో ఉంటే ఏడు తరాలూ సంపన్నులే
24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు వార్నింగ్
24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు వార్నింగ్
మారిన పీఎఫ్ రూల్స్.. అమల్లోకి కొత్త నిబంధనలు
మారిన పీఎఫ్ రూల్స్.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఇనుము కంటే ఐదు రెట్లు బలం..బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కంటే స్ట్రాంగ్‌
ఇనుము కంటే ఐదు రెట్లు బలం..బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కంటే స్ట్రాంగ్‌
సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నేహా శెట్టి
సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నేహా శెట్టి
ఉద్యోగాల కోసమని మయన్మార్ వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉద్యోగాల కోసమని మయన్మార్ వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్.. పవన్ కల్యాణ్ ప్రతిభకు గుర్తింప
టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్.. పవన్ కల్యాణ్ ప్రతిభకు గుర్తింప