Tirupati: తిరుమలలో గంగమ్మ జాతర.. సందడితో హోరెత్తనున్న తిరువీధులు..
నిరంతరం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లే శ్రీవారి సన్నిధి తిరుపతి. ఇప్పుడిక వారంరోజుల పాటు జాతర సందడితో హోరెత్తబోతోంది. తెలంగాణాలో బోనాలు, బతుకమ్మ.. సమ్మక్క-సారక్కలాగే.. తిరుపతిలో చెప్పుకోదగ్గది గంగమ్మ జాతర. ఈ మహా సంబరంలో తిరుపతి మొత్తం పులకించిపోతోంది.

తిరుపతిలో గంగమ్మ జాతర సందడి.. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం చాటింపుతో అట్టహాసంగా మొదలైంది. జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం వేషాల పండుగ. మొదటిరోజు భైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడోరోజు తోటివేషం, నాలుగోరోజు దొర వేషం. ఈసారి మరో సూపర్ స్పెషాలిటీ ఏంటంటే కాంతార వేషం.
రూ. 16 కోట్ల ఖర్చుతో తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేశారు. ఈ నెల 1 నుంచి 5 వరకు పీఠాధిపతులు, మఠాధిపతుల సమక్షంలో మహా కుంభాభిషేకం జరిగింది. సాక్షాత్తూ తిరుమలేశుడి సోదరిగా భావించే గంగమ్మకు ఈ జాతరలోనే సారె సమర్పించింది టీటీడీ. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి నుంచి గంగమ్మ గుడికి చేరుకున్న సారెకు ఘనస్వాగతం పలికింది భక్తజనం.
గతంలో తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారు. ఇప్పటికీ కొందరు ఆ సెంటిమెంట్‌ని పాటిస్తారు. ఈనెల 16 వరకు జరిగే గంగమ్మ జాతరలో రాష్ట్ర వ్యాప్తంగా 25 బృందాలకు చెందిన 400 మంది కళాకారులు పాల్గొంటారు. అందుకే గంగమ్మ జాతర తిరుపతి వాసులకే కాదు.. చిత్తూరు జిల్లా మొత్తానికి ఒక మహా సంబరం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..