Vijayawada Btech Student: బర్త్‌డే పార్టీకి వెళ్లాడు.. శవమయ్యాడు.. జీవన్‌ను హత్య చేసిందెవరు..?
బీటెక్ విద్యార్థి జీవన్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ పోలీసులు అనేక కోణాలు విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుడి బైక్, సెల్ తప్పా ఎలాంటి అధారాలు కనిపించకపోవడంతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థి జీవన్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ పోలీసులు అనేక కోణాలు విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుడి బైక్, సెల్ తప్పా ఎలాంటి అధారాలు కనిపించకపోవడంతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అసలు విజయవాడకు చెందిన జీవన్ పెదపులిపాక పొలాల్లోకి అర్ధరాత్రి ఎందుకు వెళ్లాడు?. హత్యకు గల కారణాలు ఏంటీ? అనే క్లూస్ రాబట్టే పనిలో ఉన్నారు. జీవన్ కు సంబంధించిన ఫ్రెండ్స్ ను ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. అయితే, స్నేహితులే ఏదో చేసారని జీవన్ తండ్రి సుధాకర్ ఆరోపిస్తుండటంతో పోలీసులు స్నేహితులను విచారిస్తున్నారు.
అయితే, బీటెక్ విద్యార్థి జీవన్‌ది హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్లిన జీవన్ ఫ్రెండ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. శ్యామ్ అనే స్నేహితుడి బర్త్‌డే పార్టీకి జీవన్ వెళ్లాడు. ఈ క్రమంలో శ్యామ్‌తో పాటు మరికొందరు ఫ్రెండ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పార్టీ తర్వాత ఇంటికి వెళ్లిన జీవన్‌ను.. స్నేహితులు మళ్లీ పిలిపించినట్లు విచారణలో తేలింది. రాత్రి రెండు గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి నాన్న జాగ్రత్త అని చెప్పిన జీవన్.. ఆ తర్వాత చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఫోన్ చేసి నాన్న జాగ్రత్త అని చెప్పాడని.. జీవన్ తల్లి నాగమణి పేర్కొన్నారు. ఏమైందిరా ఏమన్నా ఉంటే చెప్పు అని కూడా అడిగానని.. ఏం చెప్పలేదని పేర్కొన్నారు. తెల్లవార్లూ ఫోన్ ఎత్తలేదని.. ఎలాంటి సమస్యలు లేవు.. ఇప్పుడు శవమై వచ్చాడంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులే ఏదో చేసారంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..