AP FiberNet case: ఏపీ ఫైబర్ నెట్‌లో అవకతవకలపై సీఐడీ దూకుడు.. IRS అధికారి సాంబశివరావు అరెస్ట్
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు.
అక్రమాల డొంక కదులుతోంది. ఏపీ ఫైబర్ నెట్‌లో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది. IRS అధికారి సాంబశివరావును CID అరెస్ట్ చేసింది. వైద్య పరీక్షల కోసం ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫైబర్‌నెట్ స్కాంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. 18 మంది నిందితులపై కేసు నమోదు చేసిన సీఐడీ , టెరాసాఫ్ట్ కంపెనీ మోసాల కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండీ సాంబశివరావు సహా పలువురుని విచారించింది. గత ఐదు రోజుల సీఐడీ అధికారుల విచారణలో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే IRS అధికారి సాంబశివరావును అరెస్ట్ చేశారు.
హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ను టెరాసాఫ్ట్ కంపెనీ మోసం చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కె.జైన్ నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించింది. టెరాసాఫ్ట్ కంపెనీకి కొన్ని అర్హతలు లేనందునే తమను ఇన్వాల్వ్ చేసినట్లు సీఐడీకి చెప్పారు అనిల్. తమకు రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదన్నాడు. ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు. సాంకేతిక పరికరాలు సంస్థకు చేరకుండానే బిల్లులు మంజూరు చేశారని..వీటితో పాటు సాంకేతికపరంగా పలు రకాల అవకతవకలు జరిగాయన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు తొలగించారని.. దీనిపై అభ్యంతరాలు, కంప్లైంటులను పట్టించుకోలేదన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 18మందిని అనుమానితులుగా గుర్తించి సీఐడీ కేసులు నమోదు చేశారన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే సీఐడీ చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి