Konaseema: చేపల కోసం వల వేస్తే.. కాసుల పంట పండింది.. ఏం చిక్కిందో తెల్సా..?

చేప చేప ఎందుకు ఎండలేదు..? ఇది పాత కథ..!! చేప చేప ఎన్ని లక్షలు కుమ్మరించావు..? ఇది కొత్త కథ..!!! అరుదైన కచిడి చేప.. కాసుల పంట పడిస్తోంది. మత్స్యకారుల ఇంట ఆనందాలు కురిపిస్తుంది.

Konaseema: చేపల కోసం వల వేస్తే.. కాసుల పంట పండింది.. ఏం చిక్కిందో తెల్సా..?
Kachidi Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2023 | 10:12 AM

సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు చాలామంది జాలర్లు. రోజుల తరబడి సముద్రంలో వేటసాగించినా, వారికి కొద్ది మొత్తంలోనే ఆదాయం వస్తుంటుంది. కానీ ఒక్కోసారి వారి వలకు లక్ కూడా చిక్కుతుంటుంది. సాధారణ చేపల కోసం విసిరే వలకు, అరుదైన, సిరులు కురిపించే మత్స్యాలు దొరుకుతుంటాయి. తాజాగా కోనసీమ జిల్లా, అంతర్వేదిలో ఓ మత్స్యకారుడి పంట పండింది. అంతర్వేది గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడి వలకు 26 కేజీల కచిడి మగ చేప చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. అందుకు కారణం అతడి వలకు చిక్కిన చేప ధరే. ఈ చేపని అంతర్వేది మినీ హార్బర్ మార్కెట్ లో వేలం వేయగా అక్షరాలా రెండు లక్షలా పదివేల రూపాయలు పలికింది. క్రోకడ్‌ ఫిష్‌ అని కూడా పిలిచే కచిడి చేపలో మెడిసినల్‌ వాల్యూస్‌ అధికంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇది అత్యధిక ధరపలుకుతోందంటున్నారు నిపుణులు.

దీనిని బంగారు చేపగా కూడా పిలుస్తుంటారు మత్స్యకారులు. ఎందుకంటే దీని ఖరీదు బంగారంతో పోటీపడుతుంటుంది అని చెబుతారు. కచ్చిడి చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో యూజ్ చేస్తారట. సర్జికల్‌ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో దీని గాల్‌బ్లాడర్‌ను వినియోగిస్తారట. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. అందుకే దీనికి ఇతర చేపలతో పోలిస్తే, రేటు ఎక్కువని చెబుతున్నారు వ్యాపారులు. కచ్చిడి చేపలను కలకత్తా, కేరళ, శ్రీలంకు ఎగుమతి చేస్తుంటామని వ్యాపారులు వెల్లడించారు. ఈ చేపలు నిలకడగా ఒకే చోట ఉండవని అందుకే.. చాలా అరుదుగా వలకు చిక్కుతుంటాయని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం