AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur District: పి.హెచ్.సీలో కామాంధుడు.. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి..

యాడికి మండలంలోని రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునే గదిలో అటెండర్ రహస్య కెమెరా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Anantapur District: పి.హెచ్.సీలో కామాంధుడు.. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి..
Shocking Incident
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2023 | 10:43 AM

Share

ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడోచోట ఉన్మాదుల బారిన పడకతప్పడం లేదు. అనంతపురం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ ఘటన మహిళా సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. యాడికి మండలం రాయలచెరువు పీహెచ్‌సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేటప్పుడు నరేంద్ర అనే టెండర్‌ రహస్యంగా వీడియోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాక్స్ కు రంద్రం చేసి..  అందులో సెల్ ఫోన్ పెట్టి వీడియో తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో రహస్యంగా సెల్‌ఫోన్‌ అమర్చి గత కొంతకాలంగా నరేంద్ర ఈ దారుణానికి పాల్పడుతున్నట్టు స్పందన కార్యక్రమంలో 40 మంది మహిళా సిబ్బంది కంప్లైంట్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎవరెవరి వీడియోలు అందులో ఉన్నాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు మహిళా ఉద్యోగులు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. షీ టీమ్స్‌కి ఈ కేసు హ్యాండోవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి వద్ద ఉన్న ఫోన్ సీజ్ చేసి.. తమ పరువుకు భంగం కలగకుండా చూడాలని మహిళాా సిబ్బంది కోరుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఆరోపణల్లో నిజం ఎంత..?  ఆ వీడియోలు.. అతడి వద్ద మాత్రమే ఉన్నాయా..? ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం