AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని ఈ రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళా ఉద్యోగులే

యత్ర నార్యస్తు పూజ్యతే.. రమంతే తత్ర దేవతా...అన్నది ఆర్యోక్తి. స్త్రీలు గౌరవించే చోట దేవతలు నివసిస్తారన్నది..పెద్దల మాట. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలమన్న నినాదమే ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. ఇలాంటి గౌరవమే దక్షిణ మధ్య రైల్వే కూడా చాటుకుంటోంది. చంద్రగిరి రైల్వేస్టేషన్ ను మహిళ ఉద్యోగులతోనే నడుపుతోంది. రైల్వేలో పనిచేసే మహిళా ఉద్యోగులకు తగిన గుర్తింపు ఇస్తోంది.

Andhra Pradesh: ఏపీలోని ఈ రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళా ఉద్యోగులే
Female Staff
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 07, 2025 | 7:01 PM

Share

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చంద్రగిరి రైల్వే స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తిరుపతి జిల్లాలోని ఈ స్టేషన్‌లో పనిచేస్తున్నది మహిళలే కావడం ఇక్కడి ప్రాధాన్యత. అంతా మహిళా ఉద్యోగులతోనే చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను నడిపించడం.. రైల్వే శాఖ మహిళా సాధికారితకు పట్టం కడుతోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకో గలిగేలా నిరంతర జీవనాధార అవకాశాలను స్వయంగా ఏర్పరచుకుని ఉన్నత స్థితికి ఎదుగుతున్న స్త్రీ శక్తి ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.

ఇలా విద్య, వైద్యం, వ్యాపార రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న మహిళ లోకం ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది. పురుష శక్తికి తామేమి కాదని చాటి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక జరుగుతుండగా చంద్రగిరి రైల్వే స్టేషన్ ఇందుకు ఆదర్శంగా నిలిచింది. రైల్వే శాఖలో స్టేషన్ల నిర్వహణ కీలకం కాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడు రైల్వేస్టేషన్లను మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తుండగా అందులో ఒకటి గుంతకల్లు డివిజన్ పరిధిలోని చంద్రగిరి రైల్వే స్టేషన్. ఒక చారిత్రక నిర్ణయంతో మహిళా సిబ్బందిని నియమించి స్టేషన్ నిర్వహణ చేపట్టింది. ఇందులో భాగంగానే చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ నుంచి పాయింట్ విమెన్ దాకా పనిచేస్తున్నది ఉమెన్స్ కావడం ఇక్కడి విశేషం. ముగ్గురు స్టేషన్ మాస్టర్లు, నలుగురు పాయింట్స్ ఉమెన్స్‌తో పాటు ఒక సఫాయి వాలాగా ఈ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. రోజు 38 దాకా ఎక్స్ ప్రెస్ రైళ్ళు, 13 ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో కొనసాగుతుండగా గుంతకల్లు, కాట్పాడి వైపు నడుస్తున్న గూడ్స్‌లు, కోచింగ్ ట్రైన్లు చంద్రగిరి రైల్వే స్టేషన్ మీదుగా వెళుతున్నాయి. రైల్వే స్టేషన్ లో టికెట్ల విక్రయం, రక్షణ, పచ్చ జెండా ఊపడం, పారిశుధ్యం లాంటి పనులన్నీ మహిళా ఉద్యోగులు చేస్తున్నారు. రైల్వే శాఖలో 20 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్లు ఆ శాఖ లెక్కలు చెబుతుండగా పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రైల్వే స్టేషన్ నిర్వహిస్తా మంటూస్టేషన్ మాస్టర్ సంగీతలక్ష్మి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కావ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..