ఆయ్.. గోదారోళ్ల మర్యాదంటే మాములుగా ఉండదండి మరి. కొత్త అల్లుడికి ఏకంగా..
కొత్త అల్లుడికి 156 రకాల వంటకలతో జిగేల్ మనిపించేలా విందును పెట్టారు. ఇటీవల పచ్ఛిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన కిరాణా వ్యాపారి కుమారుడు రిసింద్రకు వివాహం చేశారు. సంక్రాంతి కావడంతో పండక్కి పిలిచి విభిన్న వంటకాలతో అబ్బురపరిచారు. సంక్రాంతి పండక్కి ఆహ్వానం గా పిలిచి...

గోదారోళ్లకు వేటాకరంతో పాటు మమకారం కూడా ఎక్కువేనండి. అందరి మనస్తత్వం కూడా ప్రేమానురాగాలు గానే విరజిల్లుతాయి అనడానికి వారు చేసే మర్యాదలు చూస్తేనే అర్థమవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి చవ్వా నాగ వెంకట శివాజీ తన అల్లుడికి సంక్రాంతికి ఇచ్చిన అతిథ్యం చూస్తే మర్యాద విషయంలో గోదారోళ్ల తర్వాతే ఎవరైనా అనిపించకమానదు.
కొత్త అల్లుడికి 156 రకాల వంటకలతో జిగేల్ మనిపించేలా విందును పెట్టారు. ఇటీవల పచ్ఛిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన కిరాణా వ్యాపారి కుమారుడు రిసింద్రకు వివాహం చేశారు. సంక్రాంతి కావడంతో పండక్కి పిలిచి విభిన్న వంటకాలతో అబ్బురపరిచారు. సంక్రాంతి పండక్కి ఆహ్వానం గా పిలిచి కొత్త అల్లుడుకి 156 రకాల వంటకాలు,స్వీట్స్‌తో భోజనం పెట్టి ఔరా అనిపించేలా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చెందిన హర్షిత, భర్త రీషింద్ర వివాహం తర్వాత మొదటి సారి అమ్మగారి ఇంటికి వచ్చారు. అల్లుడి తొలి సంక్రాంతికి రావడంతో వెంకట శివాజీ కుటుంబం మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వాలనుకుంది.
ఇందులో భాగంగానే అతడికి.. వెండి కంచంలో 156 వరకు వివిధ రకాల వంటలు పెట్టి రుచి చూపించారు. సంప్రదాయ పద్ధతిలో చక్రపొంగలి, చిక్కిరాలు, కోనసీమ పూతారేకులు, కాకినాడ కాజా, బెంగుళూరు కోవ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి విభిన్న రకాల వంటకాలను తీసుకొచ్చి అబ్బురపరిచారు. అల్లుడికి అత్తింటి రుచి చూపేందుకు మూడు రోజుల్లో 100 రకాల పిండి వంటకాలను స్వయంగా తయారు చేశారు.
స్వీట్లతో పాటు పండ్లను సైతం అందించారు. ఆశాడం సారె కాకుండా సంక్రాంతి కూడా ఈవిధంగా 156 రకాల వంటకాలు, స్వీట్ లతో పెట్టడం ఒక్క గోదావరి జిల్లాల వారికే సొంతమని మరోసారి నిరూపించారు. దీంతో గోదావరి వాళ్ల మర్యాదాలు చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ని వంటకాలతో భోజనమా వామ్మో.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




