YS Sharmila: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల..
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొననారు. అయితే, అంతకుముందు.. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు..

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొననారు. అయితే, అంతకుముందు.. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే, గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు.. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే పదవీ త్యాగానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Congress President Shri @Kharge has appointed Smt. @realyssharmila as the President of the @INC_Andhra with immediate effect.
Shri @Kharge has also appointed Shri @RudrarajuGidugu, the outgoing PCC President, as a special invitee to the Congress Working Committee. pic.twitter.com/xB2TRTKO19
— Congress (@INCIndia) January 16, 2024
కాగా.. వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సోనియా గాంధీని సైతం షర్మిల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానన్న షర్మిల.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సక్యులర్ పార్టీ అంటూ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..