Independence Day 2021: ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.. విజయవాడలోనే జెండా పండుగ..
Independence Day 2021: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు విజయవాడ ముస్తాబయింది. రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని...
Independence Day 2021: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు విజయవాడ ముస్తాబయింది. రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆదివారం నాడు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం జగన్.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా ప్రదర్శనల కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధంగా ఉంచారు.
అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆహ్వానితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటల లోపు సభా ప్రాంగాణంలోనికి వచ్చి.. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని ప్రభుత్వం యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఇదిలాఉంటే.. జిల్లాల్లో మంత్రులు, ఇంచార్జి మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Also read:
Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..
Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..