AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru Municipal Corporation Election Results: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మరికాసేపట్లో వెలువడనున్న ఫలితాలు..

Eluru Municipal Corporation Election Results 2021: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధంచేశారు. ఈ రోజు ఉదయం

Eluru Municipal Corporation Election Results: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మరికాసేపట్లో వెలువడనున్న ఫలితాలు..
Eluru Municipal Corporation Election Results
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2021 | 12:49 PM

Share

Eluru Municipal Corporation Election Results 2021: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధంచేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌కు అనుమతించడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కౌంటింగ్‌ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్‌ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే అనుమతిచ్చారు. మొత్తం 50 డివిజన్లకు గాను 3 ఏకగ్రీవం అయ్యాయి. ఈ 3 ఏకగ్రీవ డివిజన్లు ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంకా 47 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. వైసీపీ 47 స్థానాల్లో పోటీచేయగా.. టీడీపీ 43 స్థానాల్లో, 20 చోట్ల జనసేన, ఇతర అభ్యర్థులు కలిపి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రంలో నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.

కాగా.. మార్చి 10న ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్పోరేషన్‌ పరిధిలో 56.86 పోలింగ్ శాతం నమోదైంది. కోర్టు కేసుల నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియను వాయిదా వేశారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నట్లు ఎన్నిక కౌంటింగ్‌పై సింగిల్‌ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం గతంలో స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వంతోపాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు.