AP Municipal Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ.. పూర్తి ఇక్కడ చూడండి..

AP Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లకు అవకాశం ఉండగా..

AP Municipal Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ.. పూర్తి ఇక్కడ చూడండి..
Nominations
Follow us

|

Updated on: Nov 05, 2021 | 8:01 AM

AP Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లకు అవకాశం ఉండగా.. ఆ తరువాత ప్రక్రియ ముగుస్తుంది. రేపు అంటే శనివారం నాడు దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అదే రోజున తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. కాగా, బుధవారం నాడు అమావాస్యం కావడంతో పెద్దగా నామినేషన్లు కాలేదని తెలుస్తోంది. ఇవాళ చివరి తేదీ కావడంతో.. నామినేషన్లు దాఖలు చేసే వారి సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థుల మరణించడం, వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 69 సర్పంచ్‌లు, 533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్ 5 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు ఇచ్చింది. నవంబర్ 6న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి తేదీ అని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి.. 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.

కాగా, ఎన్నికలు జరుగుతున్న 12 మున్సిపాలిటీల్లో కుప్పం మున్సిపాలిటీ ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే.. కుప్పంలో చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. కుప్ప మున్సిపాలిటీగా మారిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది కావడంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం మున్సిపల్ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి.

Also read:

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!

Karthika Masam: నేటి నుంచి శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

Virat Kohli Birthday: పరుగుల యంత్రం.. శతకాల చక్రవర్తి.. ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. మచ్చుకు కొన్ని..!