ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీకి ఈసీ షెడ్యూల్‌… పోలింగ్ ఎప్పుడంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక సంద‌డి మొద‌లు కాబోతుంది. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ఆగ‌ష్టు 6వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అలాగే ఆగ‌ష్టు 13న నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ కాగా....

ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీకి ఈసీ షెడ్యూల్‌... పోలింగ్ ఎప్పుడంటే?
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 2:45 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక సంద‌డి మొద‌లు కాబోతుంది. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ఆగ‌ష్టు 6వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అలాగే ఆగ‌ష్టు 13న నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ కాగా.. ఆగ‌ష్టు 24వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఇక అదే రోజున ఓట్ల లెక్కింపు, రిజ‌ల్ట్స్ ఉంటాయి. ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ రమ‌ణ‌ను వైసీపీ స‌ర్కార్ రాజ్య‌స‌భ‌కు పంపించ‌డంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ రాజీనామాతో ఖాళీగా ఉన్న స్థానానికి ప‌ద‌వీకాలం ఆరు నెల‌ల‌లోపే ఉండ‌టంతో.. ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుల చేసింది. కాగా ఈ ప‌ద‌వి కోసం వైసీపీలోని ఆశావహులు పోటీ ప‌డుతున్నారు.

కాగా ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో.. మినిస్ట‌ర్లుగా ఉన్న మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌లు రాజ్య‌స‌భకు ఎంపిక అయిన విష‌యం తెలిసిందే. దీంతో వారు త‌మ మంత్రులు ప‌ద‌వుల‌తో పాటు, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశారు. ఇటీవ‌లే వారిద్ద‌రూ రాజ్య‌స‌భ ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే.

Read More: 

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..