వాటర్‌ట్యాంక్ ఎక్కి వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..కారణం తెలస్తే షాక్!
భూ వివాదంలో తమకు రావాల్సిన డబ్బులు రాలేదని.. గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ.. వృద్థ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మీ అనే దంపతులు స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే.. భూమి అమ్ముతామని చెప్పి.. గ్రామ పెద్దలు తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుని.. స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. […]
భూ వివాదంలో తమకు రావాల్సిన డబ్బులు రాలేదని.. గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ.. వృద్థ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మీ అనే దంపతులు స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కారు.
వివరాల్లోకి వెళ్తే.. భూమి అమ్ముతామని చెప్పి.. గ్రామ పెద్దలు తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుని.. స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులైనా.. వారు సమాధానం చెప్పకుండా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో.. మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నంకు యత్నించబోయారు. ఇంతలో.. స్థానికంగా ఉన్నవారు అధికారులకు సమాచారమిచ్చారు. వాసుదేవరావు, లక్ష్మీలతో మాట్లాడిన అధికారులు.. భూమి రిజిస్ట్రేషన్‌పై హామీ ఇచ్చి వారికి కిందికి దించారు.