వైరల్‌గా మారిన మహిళా ఎంపీ ఫొటో షూట్
అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె మనువాడనున్నారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె అయిన మాధవి.. మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి […]
అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె మనువాడనున్నారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
కాగా మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె అయిన మాధవి.. మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌పై రెండున్నల లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. మరోవైపు గొలుగొండ మండలం కేడీ పేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కాలేజ్ కరస్పాండెట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. వీరిద్దరి వివాహం మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో జరగనుంది. వివాహానంతరం ప్రముఖుల కోసం విశాఖ సమీపంలోని రుషికిండ వద్ద ఓ రిసార్ట్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.