Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు.

Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..
Minister Lokesh
Follow us

|

Updated on: Jul 24, 2024 | 3:19 PM

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆ పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పెద్ద ఎత్తున వైఫల్యం చెందిందని ఆరోపించారు. గతపాలకుల అసమర్థత వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు 72వేల మంది తగ్గారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న విద్యావిధానానికి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని వివరించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి విద్యావ్యవస్థలో మంచి విధివిధానాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ