AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ ఆగ్రహం.. CS, DGPలకు సమన్లు

ఏపీలో హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీటిని నివారించడంలో జరిగిన వైఫల్యంపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలకు సమన్లు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరనున్నట్లు తెలిసింది.

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ ఆగ్రహం.. CS, DGPలకు సమన్లు
Post Poll Violence
Ram Naramaneni
|

Updated on: May 15, 2024 | 4:50 PM

Share

ఏపీ ఎన్నికల ఎపిసోడ్లో జరిగిన గొడవలను EC సీరియస్ గా తీసుకుంది. CEO ఆదేశాలతో బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. పోలింగ్ డే కన్నా.. ఆ తర్వాతే ఎక్కువ హింస జరిగిందనని గుర్తించింది EC. ఎన్నికల మరుసటి రోజు జరిగిన అల్లర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో జరిగిన హింసాకాండలో ముఖ్యంగా నాలుగు ఏరియాలను గుర్తించి..యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఏపీలో హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. గురువారం..  ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌కు ఆదేశించింది.  మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై పూర్తి వివరణతో రావాలని సూచించింది.  ఎన్నికల అనంతర హింసను ఎందుకు ఆపలేదో వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తాలను బుధవారం ఢిల్లీకి పిలిపించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సోమవారం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరగ్గా, మంగళ, బుధవారాల్లో హింస చెలరేగింది.

ముఖ్యంగా తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసారావుపేటలో వయిలెన్స్ ఎక్కువ జరిగిందని ఈసీ చెప్తోంది. గొడవల్లో పాల్గొన్న వారు ఎవరైనా సరే ఉపేక్షించేదని లేదిన ఏపీ సీఈసీ ముఖేష్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నరసారావుపేట, మాచర్లతో ముఖ్యనేతలను హౌజ్ అరెస్ట్ చేసినట్టు చెప్పారు. చంద్రగిరిలో దాదాపు 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఎన్నికల రోజు 9 ప్రాంతాల్లో ఈవీఎం మేషీన్లను ధ్వంసం చేసినట్టు గుర్తించారు. సీసీ కెమెరా ఫూటేజ్ ఆధారంగా ఒక్కొక్కరిని గుర్తించి సీవియర్ కేసులు ఫైల్ చేస్తున్నారు. మరో రెండురోజుల్లో అందరిని గుర్తించి జైలుకు పంపిస్తామని చెప్తున్నారు.

పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144సెక్షన్‌ విధించారు పోలీసులు. టీడీపీ-వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దాడులను నివారించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. నేతలు పర్యటించకుండా ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.

నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహనిర్బంధంలో ఉంచారు. ఇద్దరు నేతల ఇళ్ల దగ్గర పోలీసుల మోహరించి..బారికేడ్ల ఏర్పాటు చేసి రాకపోకలు బంద్ చేశారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి.. ప్రతీ ఒక్కర్ని తనిఖీ చేశాకే వదులుతున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. దాడులు జరుగుతాయన్న సమాచారంతో అలర్ట్‌ అయ్యారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మలమడుగులో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. అల్లర్లను కట్టడి చేసేందుకు 500మంది పోలీసులను జమ్మలమడుగుకు పంపించారు డీజీపీ. దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగిచ్చారు.

నేతల పర్యటనలతో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుండటంతో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణలతో చంద్రగిరి, తిరుపతిలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి, తిరుపతిలో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో నాలుగు కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..