తెలుగు రాష్ట్రాలో సరికొత్త దందా.. ఫుడ్‌బిజినెస్ వ్యాపారులే టార్గెట్‌గా నిలువు దోపిడీ..
వాళ్ళని నమ్ముకొని బిజినెస్ చేద్దామనుకున్న వాళ్ళకి అత్యాశే ఎదురవుతుందని ఇలాంటి ముఠాలకు పోలీసులు చెక్ పెట్టాలంటూ కోరుతున్నారు బాధితులు. చెప్పాపెట్టకుండా పారిపోయారని ఎవరికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదని
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకమైన దందా తెరపైకి వచ్చింది. చూడటానికి చిన్న సమస్యలా కనిపించినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్ప ఇది ఒక పెద్ద దందా అని, దేశ వ్యాప్తంగా విస్తరించిన నెట్ వర్క్ అంటున్నారు నిండా మునిగిన బాధితులు. అలా అని వీళ్ళపై కంప్లైంట్స్ ఉండవు, అలా చూస్తూ ఊరుకోలేమని వ్యాపారమే పెట్టుబడిగా పెట్టి ఎదగాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని దెబ్బ కొడుతున్నారాని మోసపోయిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి వెనుక ఉండి నడిపిస్తున్న ముఠాలు దేశవ్యాప్తంగా ఈ రకంగా పెద్ద దందానే జరుగుపుతున్నా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఈ ముఠా చేసే మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరా ముఠా..? ఏంటా స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ స్టాల్స్ యాప్స్ పెట్టేవారీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా ప్రజలకు ఇష్టమైన వంటకాల విషయంలో దేశ విదేశాలకు సంబంధించి డిష్ లు సిద్ధం చేసే వారిని ఏరి కోరి మరీ ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ బిజినేస్ పెడుతున్న నిర్వాహకులు. అయితే వారిలో ముఖ్యంగా స్కిల్ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇదే అదునుగా కొన్ని ఈశాన్య రాష్ట్రాల ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ పైన యువత ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే ఫుడ్ స్టార్ట్ అప్స్ ఎక్కువగా స్కిల్ వర్కర్స్ తో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కుక్స్, చెఫ్, వర్కర్స్‌ను ప్రత్యేకంగా తమ ఫుడ్ బిజినెస్ అవసరాల కోసం నియమిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా క్రేజ్‌లో ఉండటంతో ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇతర దేశాల్లో తయారయ్యే ఏ డిష్ ప్రత్యేకించి తయారు చేయాలంటే స్కిల్ కుక్, లేదా చెఫ్ తోనే సాధ్యమవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ ఫుడ్ స్టార్ట్ అప్స్ , ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినా హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి ప్రారంభించినా కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా వర్కర్స్ గా నియమిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ఈశాన్య రాష్ట్రాల ముఠాలు భారీ ఎత్తున దందాకు, దోపిడీకి, మోసాలకు తెరలేపాయి. దీనితో పెట్టుబడి పెట్టిన చాలా మంది ఈ ఈశాన్య రాష్ట్రాల ముఠాల ఉచ్చులో ఇరుక్కొని బయటకు రాలేక అలా బిజినెస్ క్లోజ్ చేయలేక నడపలేక లబోదిబోమంటూ తలలు బాదుకుంటున్నారు.
ముఠాల దందా అంతా ఎక్కడ జరుగుతుంది…
ఇటీవల ఉద్యోగాల కోసం అంటూ వర్క్ చేయడం కోసం అంటూ ఇతర రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, నాగాలాండ్, త్రిపురతో పాటు, బెంగాల్, నేపాల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారంతా ఈ ముఠాల మాటున మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య ప్రధాన పట్టణాల్లో గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ,గుంటూరు తిరుపతి, నెల్లూరు లాంటి ప్రాంతాలతో ప్రధాన పట్టణాల్లో ఫుడ్ బేసిడ్ బిజినెస్ పెరగడంతో కొంతమంది ముఠాలుగా ఏర్పడి వర్కర్స్ అండ్ సప్లై చేస్తామని పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎక్కడ బిజినెస్ స్టార్ట్ అయిన తాము వర్కర్స్‌ని సప్లై చేస్తామంటూ చెప్పి అడ్వాన్సుల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోతున్నారు. మధ్యవర్తిగా వచ్చిన వాళ్లు కమిషన్లు దండుకోవడం ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు అడ్వాన్సుల రూపంలో లక్షలు లక్షలు తీసుకొని జంప్ అయిపోవడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. దీంతో వారి గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోతుంది.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ముఠాలుగా సంచరిస్తూ ఉద్యోగాల పేరుతో పనుల పేరుతో హోటల్స్ లో వర్క్ చేస్తామంటూ వచ్చిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలామంది యువత ఆయా యజమానులకు పంగనామం పెడుతున్నారు. వీరిలో మహిళలు సైతం ఉండటం గమనార్హం. ఒక్క విజయవాడ నగరంలోనే నెలకు ఇలా 4 నుంచి 50 వరకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో ఒక్క విజయవాడ నగరంలో 35కు పైగా ఘటనలు ఇలా జరిగాయని. ఫుడ్ బిజినెస్ పెట్టిన నిర్వాహకులు తలలు బాదుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని అడ్వాన్సుల రూపంలో డబ్బులు తీసుకున్న బ్రోకర్లు ఉద్యోగం కోసం వచ్చిన వర్కర్లు ఇద్దరు కలిసి లక్షల్లో దండుకోవడం 10 రోజులు ఒక చోట 20 రోజులు మరో చోట పని చేస్తూ రాత్రికి రాత్రే చెప్పా పెట్టకుండా సర్దేస్తున్నారని వాపోతున్నారు. వాళ్ళని నమ్ముకొని బిజినెస్ చేద్దామనుకున్న వాళ్ళకి అత్యాశే ఎదురవుతుందని ఇలాంటి ముఠాలకు పోలీసులు చెక్ పెట్టాలంటూ కోరుతున్నారు బాధితులు. చెప్పాపెట్టకుండా పారిపోయారని ఎవరికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదని పోలీసులు కూడా కంప్లైంట్స్ తీసుకోవడం లేదని బోరుమంటున్నారు.
ఇదిలా వుండగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పరిధిలో హై వే వెంబడి భారీ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వర్కర్స్ ను నియమిస్తే లక్షలకు లక్షలు అడ్వాన్సులు తీసుకొని రాత్రికి రాత్రే చెక్కేయడంతో అన్ని చోట్ల గాలించారు. చివరకు పోలీసులకు కూడా పిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారిని గాలిస్తున్న క్రమంలోనే అడ్వాన్స్ తీసుకొని పారిపోయిన వర్కర్ instagram రీల్ చూసి విజయవాడలో ఉన్నట్లు తెలుసుకొని దేహశుద్ధి చేసి డబ్బులు వసూలు చేసి స్టేషన్లో అప్పగించారు. మరో ఘటనలో సౌరభ్ అనే యువకుడు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఐ ఫోన్ తో సహా రాత్రికి రాత్రే విజయవాడ నుంచి పారిపోవడంతో చివరికి అతని స్నాప్ చాట్ అకౌంట్ ద్వారా విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇలా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఠాలు బతుకుదెరువు కోసం అంటూ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్న వారిని నిండా ముంచేస్తున్నారు. ఎప్పటికైనా ఎవరైతే ఫుడ్ బిజినెస్ పెడుతున్నారో వారు అప్రమత్తంగా ఉండకపోతే ఈ ముఠాలకు బలి కావాల్సిందేనని నష్టపోయిన యజమానులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి