Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆమెకు ఇన్‌స్టా అంటే ప్రాణం..! అడ్డుపడ్డ భర్తను భరించలేక ఏం చేసిందంటే

ఆమెకు ఇన్‌స్టా అంటే ప్రాణం.. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లోనే లీనమైపోతుంది. భర్త వచ్చినా కూడా పట్టించుకోలేదు.. దీంతో భర్త అడ్డుపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. ఆ తర్వాత

AP News: ఆమెకు ఇన్‌స్టా అంటే ప్రాణం..! అడ్డుపడ్డ భర్తను భరించలేక ఏం చేసిందంటే
Instagram
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2024 | 7:00 PM

సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. కాస్త తీరిక దొరికినప్పుడల్లా సరదాగా ఫ్రెండ్స్‌తోనూ చాటింగ్, బ్రౌజింగ్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వాటి వల్ల కొన్ని మనస్పర్ధలు, అనర్ధాలు కూడా తలెత్తే పరిస్థితులు ఇప్పుడు ఆందోళన గురి చేస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లీనమైందని భర్త ప్రశ్నించేసరికి మనస్తాపం చెందింది భార్య. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమంత్ రెడ్డి, భార్య నాలుగేళ్ల కుమార్తెతో కలిసి విశాఖ పీఎం పాలెంలో నివాసముంటున్నారు. భార్య స్వస్థలం ఒడిస్సాలోని రాయగడ. 2017లో వివాహమైన తర్వాత.. 2022 వరకు రాయగడలో ఇద్దరు కాపురం ఉన్నారు. ఆ తర్వాత విశాఖ వచ్చేసారు. డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న హేమంత్ రెడ్డి.. భార్యతో అన్యోన్యంగానే ఉండేవాడు. అయితే గత కొంతకాలంగా అతడి భార్య సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం కేటాయించడంతో పాటు.. చాటింగ్ చేస్తుండటంతో ఆమెను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి మనస్థాపానికి గురైంది భార్య. కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలిసిందని ఆమె ఆవేదన చెందుతూ.. నిద్ర మాత్రలు మింగింది.

ఇవి కూడా చదవండి

ఆమె అస్వస్థతకు గురి కావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు పీఎం పాలెం సిఐ బాలకృష్ణ. సోషల్ మీడియా కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినప్పటికీ.. ఆమె బలవన్మరణానికి పాల్పడటం వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భర్త హేమంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.