Prakasam District: పంటపొలాల్లో మృతదేహం.. పరిగెత్తుకుంటూ వెళ్లిన పోలీసులు.. ఊహించని షాక్

ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఈ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. అందరూ టెన్షన్ పడుతోన్న వేళ.. అసలు విషయం రివీల్ అయ్యింది.

Prakasam District: పంటపొలాల్లో మృతదేహం.. పరిగెత్తుకుంటూ వెళ్లిన పోలీసులు.. ఊహించని షాక్
Drunk Man
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2021 | 6:42 PM

పోలీసులకు ఓ మందుబాబు ఊహించని షాక్‌ ఇచ్చాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఈ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతమాగులూరు దగ్గర పొలాల్లో పంట కాలువలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రక్షక భటులు వెంటనే అలెర్ట్ అయ్యారు. అద్దంకి సీఐ రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతడిది హత్యా, లేక ఆత్మహత్యా అన్న కోణంలో చర్చించుకుంటున్నారు స్థానికులు. పంట కాలువలో మృతదేహాన్ని గుర్తించిన అనంతరం.. బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. హఠాత్తుగా ఆ వ్యక్తి పైకిలేచి ఏం జరిగిందంటూ పోలీసులను ప్రశ్నించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. తొలుత షాక్‌కు గురై అనంతరం తేరుకున్నారు. తానేదో ఓ క్వార్టర్‌ మందేసి హాయిగా పంట కాలువలో సేద తీరుతుంటే ఈ పోలీసుల హడావిడేందంటూ ఆ మందుబాబు పోలీసులకేసి చిరాగ్గా చూశాడు. మృతదేహం కోసం వస్తే మందుబాబు పైకిలేచి కూర్చోవడంతో.. ముందు పోలీసులకు కాస్త కోపం వచ్చినా, ఆ తర్వాత నవ్వుకున్నారు. అనంతరం మందుబాబును వివరాలు అడిగారు. తనపేరు నాగేశ్వరరావు అని, గుంటూరు జిల్లాకు చెందిన తాను సంతమాగులూరులో తన చెల్లెలు ఉంటే చూసిపోదామని వచ్చినట్లు తెలిపాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న పోలీసులు, స్థానికులు నాగేశ్వరరావును మందలించి పక్కనే గుళ్లో ఉన్న చేతిపంపు దగ్గర శరీరాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి పంపించివేశారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Drunk Man2

Also Read: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం

 నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్