Viral Video: నల్లమలలో తప్పతాగి ఒళ్ళు మరిచి చిందులేసిన అటవీ అధికారులు.. వీడియో వైరల్

మద్యం మత్తులో అధికారులు పరిసరాలనే మరిచిపోయారు.. స్థానికులతో కలిసి నానా హంగామా చేశారు. నల్లమలలో ఉన్న అతి పవిత్ర ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించని అధికారులు స్థానికులతో కలిసి ఇలా తాగి స్టెప్పులు వేశారు. శబ్ద కాలుష్యం వెదజల్లుతూ విందులు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ పరధిలో స్థానికులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మందు తాగి పాటలకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: నల్లమలలో తప్పతాగి ఒళ్ళు మరిచి చిందులేసిన అటవీ అధికారులు.. వీడియో వైరల్
Drunk Forest Officers Dance
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 17, 2024 | 5:23 PM

మద్యం మత్తులో అధికారులు పరిసరాలనే మరిచిపోయారు.. స్థానికులతో కలిసి నానా హంగామా చేశారు. నల్లమలలో ఉన్న అతి పవిత్ర ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించని అధికారులు స్థానికులతో కలిసి ఇలా తాగి స్టెప్పులు వేశారు. శబ్ద కాలుష్యం వెదజల్లుతూ విందులు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ పరధిలో స్థానికులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మందు తాగి పాటలకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు రేంజ్ ‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లమల అటవీ ప్రాతంలోని హబ్రాసు గుంట బేస్ క్యాంపులో వెలుగోడుకు చెందిన స్థానికులతో కలిసి అటవీశాఖ అధికారి ఈదన్న ఫుల్లుగా మద్యం సేవించి పాటలకు స్టెప్పులు వేశారు. వీడియో వైరల్ వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేశారు అధికారులు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆఫీసర్ జయరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అడవి ప్రాంతంలో ఉన్న దేవాలయాలను దర్శించుకునేటందుకు వెళ్లే భక్తులకు నిబంధనల పేరుతో వారిని అడ్డుకొని కేసులు నమోదు చేసే అటవీ శాఖ అధికారులు.. ఇలా అడవిలోనే మద్యం తాగి చిందులు వేయడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…