AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’..హైకమాండ్ సీరియస్

కాకినాడలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కీలకమైన పోస్టింగుల వ్యవహారం నుంచి బ్రాందీ షాపుల ఏర్పాటు వరకు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టీడీపీ జనసేన, ప్రజాప్రతినిధులు మధ్య వైరం తాజాగా దీపావళీ బాణాసంచా దుకాణాల ఏర్పాటులో వివాదంగా మారింది.

AP News: టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’..హైకమాండ్ సీరియస్
Janasena Vs Tdp Leaders
Pvv Satyanarayana
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 29, 2024 | 3:19 PM

Share

కాకినాడలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కీలకమైన పోస్టింగుల వ్యవహారం నుంచి బ్రాందీ షాపుల ఏర్పాటు వరకు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టీడీపీ జనసేన, ప్రజాప్రతినిధులు మధ్య వైరం తాజాగా దీపావళీ బాణాసంచా దుకాణాల ఏర్పాటులో వివాదంగా మారింది.

ప్రతి సంవత్సరం దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల విషయంలో కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుల మధ్య వివాదం రేగింది. ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) అనుచరులు రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా వినూత్నంగా రోడ్డుకి అడ్డంగా పడుకుని నిరసనలను చేపట్టారు.

దీపావళి బాణాసంచాలు దుకాణాలు తమ వారికి రాకుండా జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, ఆయన అనుచరులు అడ్డుకున్నారని నినాదాలు చేశారు. అంతేకాకుండా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ నేత, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నులలో పనిచేస్తున్నారంటూ విమర్శించారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న నాన్ స్టాప్ బస్సును కొంతసేపు టీడీపీ శ్రేణులు అడ్డగించడంతో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. ఈ వ్యవహారంపై కాకినాడ ఆర్డిఓ ఎస్ మల్లిబాబును వివరణ కోరగా కాకినాడ పరిధిలో 128 దుకాణాలకు గాను 127 దుకాణాలకు కేటాయింపులు జరిగాయని వాటిలో ఒక్కదానికి మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అనుమతులు ఆపమన్నారు. ఆ దుకాణం కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య, ఇరువైపులా దుకాణాలు ఉండటంతో అనుమతిని ఆపామన్నారు. కాకినాడ ఎంపీపై ఎమ్మెల్యే అనుచరులు విమర్శలు చేస్తూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.ఈ వివాదంపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..