“చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతారు”.. జనసేనానిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
జనసేన(Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై అనంతపురం జిల్లా గుంతకల్(Guntakal) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు పవన్ కల్యాణ్ కాదని...
జనసేన(Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై అనంతపురం జిల్లా గుంతకల్(Dharmavaram) ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు పవన్ కల్యాణ్ కాదని.. పావలా కల్యాణ్ అని సంబోధించారు. ఎవరు పావలా ఇస్తే వారి వైపు వెళతాడు, ఒకసారి బీజేపీ,మరోసారి కమ్యూనిస్ట్ వైపు వెళ్తాడని ఆరోపించారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే చదువుతారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం కదలకుండా మాట్లాడితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సభలో అరుస్తూ జుట్టు ఎగరేస్తూ, సినిమా డైలాగులు చెబుతూ ఉంటాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ హావభావాలను అనుకరించి మరీ చూపించారు. అంతకుముందు ఎమ్మెల్యే గుంతకల్ మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. అక్కడే ఒక హోటల్ కు వెళ్ళిన ఎమ్మెల్యే హోటల్ లో దోసెలు వేశారు.
ఇప్పటికిప్పుడే ఎన్నికలు లేకపోయినా.. గడప గడపకు వైఎస్ఆర్ తో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సమావేశాలతో గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఎన్నికల గేర్ ముందే వేసినట్లు కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Pakistan: పీఎం పర్యటనను కవరేజ్ చేయలేదని.. 17 మంది ఉద్యోగులను తొలగించింది.. పూర్తి వివరాలివే
Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..