Gold And Silver Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. సిల్వర్‌ రేట్‌ ఎలా ఉందంటే..

Gold And Silver Price: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడచిన వారం రోజులుగా బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. ఏప్రిల్‌ 23 నుంచి 28 వరకు ప్రతి రోజూ బంగారం ధరలో తగ్గుదుల కనిపించింది. అయితే 29వ తేదని మాత్రం ఒకేసారి రూ. 590 పెరిగింది...

Gold And Silver Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. సిల్వర్‌ రేట్‌ ఎలా ఉందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 02, 2022 | 7:15 AM

Gold And Silver Price: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడచిన వారం రోజులుగా బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. ఏప్రిల్‌ 23 నుంచి 28 వరకు ప్రతి రోజూ బంగారం ధరలో తగ్గుదుల కనిపించింది. అయితే 29వ తేదీన మాత్రం ఒకేసారి రూ. 590 పెరిగింది. ఇక ఆదివారం తులం బంగారం రూ. 160 తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ తగ్గుదల సోమవారం కూడా కనిపించింది. అయితే అది స్వల్పమే అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..

తగ్గిన బంగారం ధరలు..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,790 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల గోల్డ్‌ రేట్ రూ. 52,790గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 53,480గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల బంగారం రూ. 52,790 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లోనూ సోమవారం గోల్డ్‌ ధర తగ్గింది. ఇక్కడ 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 52,790 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,790 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,790గా నమోదైంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

* వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదనే చెప్పాలి. ఢిల్లీలో కిలో వెండి రూ. 63,500 గా ఉంది.

* ముంబయిలో సోమవారం కిలో వెండి ధర రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.

* హైదారాబాద్‌లో కిలో వెండి రూ. 69,500 గా ఉంది.

* విజయవాడలో వెండి రూ. 69,500 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ కిలో వెండి రూ. 69,500 గా నమోదైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: CSK Vs SRH: పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపు..

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..

DC vs LSG Score: మరోసారి అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయ లక్ష్యం ఎంతంటే..