AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG News: ఏప్రిల్‌లో పెట్రోల్-డీజిల్ అమ్మకాలు దాదాపు ఫ్లాట్‌.. సిలిండర్ ధర పెరగడంతో తగ్గిన గ్యాస్ వినియోగం

Petrol-Diesel: ఏప్రిల్ నెలలో గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవటంతో.. దేశంలో LPG వినియోగం తగ్గింది. అయితే పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో పెద్దగా తేడా లేదు.

LPG News: ఏప్రిల్‌లో పెట్రోల్-డీజిల్ అమ్మకాలు దాదాపు ఫ్లాట్‌.. సిలిండర్ ధర పెరగడంతో తగ్గిన గ్యాస్ వినియోగం
Ayyappa Mamidi
|

Updated on: May 02, 2022 | 7:14 AM

Share

LPG News: ఏప్రిల్ నెలలో గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవటంతో.. దేశంలో LPG వినియోగం తగ్గింది. అయితే పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో పెద్దగా తేడా లేదు. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో పెట్రోలు అమ్మకాలు(Petrol Sales) 2.1% మాత్రమే పెరిగాయి. డీజిల్ డిమాండ్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది. మహమ్మారి సమయంలో LPG వినియోగం స్థిరంగా పెరిగింది. అయితే మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో వినియోగం 9.1% మేర తగ్గింది. ముడిచమురు ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు 137 రోజుల తర్వాత మార్చిలో ధరను పెంచాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లు(Diesel Prices) లీటరుకు రూ. 10 చొప్పున పెరిగాయి. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత 16 రోజుల్లో ఇదే అతిపెద్ద పెరుగుదలగా చెప్పుకోవాలి. మార్చి 22న ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో దాని ధర రూ.949.50కి చేరింది.

మార్కెట్‌లో 90% నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఇంధన రిటైలర్లు ఏప్రిల్‌లో 2.58 మిలియన్ టన్నులు విక్రయించారు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20.4% ఎక్కువ, 2019 కంటే 15.5% ఎక్కువని చెప్పుకోవాలి. అయితే మార్చి 2022తో పోలిస్తే వినియోగం 2.1% మాత్రమే ఎక్కువగా ఉంది. డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 13.3% పెరిగి 6.69 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది ఏప్రిల్ 2019 కంటే 2.1% ఎక్కువ, మార్చి 2022 కంటే 0.3% మాత్రమే ఎక్కువగా ఉన్నాయి.

ధరల పెరుగుదల కారణంగా LPG అమ్మకాలు తగ్గాయి. 2020లో లాక్డౌన్ సమయంలో పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉచిత LPG సిలిండర్లను అందించింది. ఇది చమురు కంపెనీల నెలవారీ వృద్ధిని నమోదుకు సహాయపడింది. కానీ LPG వినియోగం ఏప్రిల్ 2022లో నెలవారీగా 9.1% తగ్గి 2.2 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇది ఏప్రిల్ 2021తో పోలిస్తే 5.1% ఎక్కువగా ఉంది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెరిగిన తర్వాత వంట గ్యాస్ అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. ధరల పెంపుదలకు ముందు మార్చి నెలలో ఇంధన అమ్మకాలు బాగా ఉన్నాయి. మార్చి మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 18%, డీజిల్ అమ్మకాలు 23.7% పెరిగాయి. ధర పెరిగే అవకాశం ఉండటంతో అనేక మంది ముందుగానే కొనుగోళ్లు చేయటం దీనికి కారణంగా తెలుస్తోంది. గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఏ నెలలోనూ లేని విధంగా మార్చిలో డీజిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ

Yes Bank: నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన యెస్‌ బ్యాంక్‌.. 2019 తర్వాత మొదటిసారి లాభాల్లోకి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్