Yes Bank: నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన యెస్‌ బ్యాంక్‌.. 2019 తర్వాత మొదటిసారి లాభాల్లోకి..

ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యెస్‌ బ్యాంక్‌(Yes Bank) నాలుగో త్రైమాసికం ఫలితాలు(Q4 Results) విడుదల చేసింది. పోయిన ఆర్థిక సంవత్సరానికి రూ.1,066 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది...

Yes Bank: నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన యెస్‌ బ్యాంక్‌.. 2019 తర్వాత మొదటిసారి లాభాల్లోకి..
Yes Bank
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 02, 2022 | 6:00 AM

ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యెస్‌ బ్యాంక్‌(Yes Bank) నాలుగో త్రైమాసికం ఫలితాలు(Q4 Results) విడుదల చేసింది. పోయిన ఆర్థిక సంవత్సరానికి రూ.1,066 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2018-19 తర్వాత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మళ్లీ లాభాలు(Profit) ఆర్జించడం ఇప్పుడేనని పేర్కొంది. 2019-20లో రూ.22,715 కోట్ల భారీ నష్టం, 2020-21లో రూ.3,462 కోట్ల నికర నష్టాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.367 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.3,788 కోట్ల నష్టాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. 2021 అక్టోబరు-డిసెంబరు నికర లాభం రూ.266 కోట్లతో పోల్చినా, ఈసారి 38 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.5,829.22 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.4,678.59 కోట్లుగా నమోదైంది.

2021-22లో డిపాజిట్లు, రుణాల పంపిణీలో బలమైన వృద్ధి నమోదు చేసినట్లు బ్యాంక్‌ తెలిపింది. 2021-22లో అన్ని విభాగాల్లో కలిపి రూ.70,000 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, జూన్‌ ఆఖరుకల్లా రూ.27,976 కోట్ల స్థూల నిరర్థక ఆస్తులను దానికి బదిలీ చేస్తామని యెస్‌బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్ ఎండీ, సీఈఓ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ “యస్ బ్యాంక్‌లో జరుగుతున్న ఈ పరివర్తన ప్రయాణం గత 2 సంవత్సరాలలో బ్యాలెన్స్ షీట్ వృద్ధి, వేగవంతమైన గ్రాన్యులరైజేషన్, ఆస్తుల నాణ్యత ధోరణులను మెరుగుపరచడం, మెరుగైన లిక్విడిటీ, బలమైన మూలధన స్థితిని స్థిరంగా మెరుగుపరిచింది.” అని అన్నారు.

Read Also.. GST Collections: దేశంలో జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు వసూళ్లు.. ఏప్రిల్ 2022లో రూ.1.68 లక్షల కోట్లు కలెక్షన్..