బ్యాంకుల ముందు పార్క్ చేసిన వాహనాలపై కన్నేసి.. డిక్కీలో దాచిన డబ్బులు కొట్టేసి.. చివరకు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బండ్ల డిక్కీల నుంచి డబ్బు కొట్టేస్తున్న ముఠా ఆచూకీని గుంటూరు(Guntur) పోలీసులు తెలుసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన ఒకరిని అరెస్టు చేశారు. వారి ఆచూకీ...

బ్యాంకుల ముందు పార్క్ చేసిన వాహనాలపై కన్నేసి.. డిక్కీలో దాచిన డబ్బులు కొట్టేసి.. చివరకు
Arrest Hyderabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 01, 2022 | 6:07 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బండ్ల డిక్కీల నుంచి డబ్బు కొట్టేస్తున్న ముఠా ఆచూకీని గుంటూరు(Guntur) పోలీసులు తెలుసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన ఒకరిని అరెస్టు చేశారు. వారి ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను గుంటూరు ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ యూపీ పంపారు. ఒక దొంగ పట్టుబడగా శనివారం గుంటూరుకు తరలించారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. గుంటూరు, విజయవాడ(Vijayawada), నగరాలతో పాటు ఆ జిల్లాల్లోని పలు పట్టణాల్లో.. బ్యాంకుల ముందు నిలిపిన వాహనాల డిక్కీల్లో నుంచి ఈ ముఠా నగదు కాజేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పట్నంబజారులోని టీస్టాల్‌ వద్ద వాహనంలో నుంచి రూ.9 లక్షలు పోయాయని బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా మరిన్ని వివరాలు తెలిశాయని పోలీసు అధికారులు చెప్పారు. పట్నంబజారులోనే మరో ఘటనలో రూ.5 లక్షలు, లక్ష్మీపురంలో ఓ బ్యాంకు ముందు రూ.3 లక్షలు ఇలా అనేక కేసులు ఇప్పటికే నగరంలోని పలు స్టేషన్లలో నమోదయ్యాయి. వాటన్నింటికి వీరే సూత్రధారులుగా భావిస్తున్నారు.

బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయటానికి వచ్చేవారు, నగదు డ్రా చేసి వాహనాల్లో దాచుకున్న వారిని లక్ష్యంగా చేసుకునే వీరు చోరీలకు పాల్పడ్డారని పోలీసులు నిర్థరించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకులు గుంటూరు నగరంలో భవనాలకు సీలింగ్‌ పనులు నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. వీరు తమ రాష్ట్రం నుంచి వచ్చే చోరీల ముఠాలకు స్థానికంగా షెల్టర్‌ ఇస్తున్నట్లు గుర్తించి, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా ఆ చోరీల గుట్టు రట్టయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..

Viral Video: అయ్యా..! ఒక్క నిమిషం నవ్వకుండా ఉండగలరా ఈ వీడియో చూసి.. మ్యాన్‌హోల్‌లో మహిళ..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!