Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..
తిరుమల తిరుపతి తొలిగడపగా ఉన్న దేవుని కడప దేవాలయంలో మూలవిరాట్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప దేవాలయాన్ని హనుమ క్షేత్రం అని పిలుస్తారు. దీని గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

తిరుమల తొలిగడప దేవుని కడపగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట అందరికీ తెలిసిందే. తిరుమల వెళ్లాలంటే తొలిగడపగా కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్లేవారు అనేకమంది ఉన్నారు. అలాంటి ఆలయంలో అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న అసలు విగ్రహం ఏమిటో తెలుసా..? దీనికి పెద్ద కథే ఉంది.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. తిరుమల తిరుపతి తొలిగడపగా ఉన్న దేవుని కడప దేవాలయంలో మూలవిరాట్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప దేవాలయాన్ని హనుమ క్షేత్రం అని పిలుస్తారు.
పూర్వకాలంలో తిరుమలకు వెళ్ళే ఏ భక్తుడైనా దేవుని కడప దేవాలయానికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేవారంట.. కృపాచార్యుడు అనే రుషి గతంలో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుపతికి వెళ్ళలేక పోయారని అప్పుడు ఆ రుషి ఇక్కడే ఉండి వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యారని పండితులు చెబుతున్నారు. ఆ రుషి తపస్సుకు మెచ్చి ఆయనకు ప్రత్యక్షమైన స్వామి వారు.. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని చెప్పారని.. ఇకనుంచి తిరుపతికి రాలేని వారు ఇక్కడ దర్శనం చేసుకున్న తిరుపతికి వచ్చినంత పుణ్యం వస్తుందని అన్నారని.. ఇక్కడి పూర్వీకులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
ఆ భక్తునికి కృపతో దర్శనం ఇచ్చారు కాబట్టి దీనిని కృపావతి అని అని పేరు వచ్చింది.. ఆ తరువాత కురప అని ఆ తరువాత కడప అని వచ్చి తిరుపతి తొలి గడపగా దేవుని కడప దేవాలయం ప్రసిద్ధి చెందింది. తిరుమలలో స్వామి వారు తూర్పు ముఖంగా ఉంటే దేవుని కడప దేవాలయంలో పశ్చిమ ముఖంతో ఉంటారు. తిరుమలకు ఇది పశ్చిమ ద్వారం గా ప్రసిద్ధి చెందింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
