AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: మొదట్లో ట్విట్టర్‌లో.. ఇప్పుడు కత్తుల్లాంటి మాటలతో.. రప్పారప్పా రచ్చకు పవర్ కౌంటర్

ఆపండి మీ రప్పా రప్పా .. గొంతుకలు కోస్తాం.. కుత్తుకలు కోస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు పవన్ కల్యాణ్. మీలాంటి వాళ్లను చాలామందిని చూశామన్నారు. ప్రజాస్వామ్యం పట్ల వైసీపీకి ఏ మాత్రం గౌరవం లేదని.. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పవన్‌ హెచ్చరించారు.

Pawan Kalyan: మొదట్లో ట్విట్టర్‌లో.. ఇప్పుడు కత్తుల్లాంటి మాటలతో.. రప్పారప్పా రచ్చకు పవర్ కౌంటర్
Pawan Kalyan
Ravi Kiran
|

Updated on: Jun 23, 2025 | 9:15 PM

Share

వచ్చింది.. పవర్ కౌంటర్ ఇంకా రాలేదేంటా అనుకుంటుండగానే వచ్చేసింది. ఏపీలో పొలిటికల్ భూకంపాన్ని రేపిన రప్పారప్పా రచ్చకు మొదట్లో ట్విట్టర్‌తో రెస్పాండ్ అయ్యారు పవన్‌కల్యాణ్. ఇప్పుడు కత్తుల్లాంటి మాటలతో బదులిచ్చారు. అసలెక్కడ మొదలైంది ఈ రప్పారప్పా సౌండ్ అంటే.. జగన్ పల్నాడు టూర్‌లో. పుష్ప సినిమా డైలాగ్‌తో కనిపించిన ఆ ప్లకార్డుతో. కూటమి పవర్లోకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భం.. అమరావతిలో వార్షికోత్సవ సమయం. మైకందుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. మొదట్లో కూల్‌కూల్‌గా మొదలుపెట్టినా.. ఆ తర్వాత ఫైర్‌ఫైటింగ్ షురూ చేశారు. సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తారా.. ఎవర్ని అంటూ అపోజిషన్ పార్టీకి గురి పెట్టేశారు. నిర్దాక్షిణ్యంగా దున్నేశారు. మీరు నరుకుతాం అంటే మేం ఈరుకుంటామా.. మాకూ వచ్చు రప్పారప్పా పెర్‌ఫామెన్స్ అంటూ సంస్కారవంతమైన సోప్‌తో వైసీపీని చాకిరేవు పెట్టబోయారు పవన్‌.

ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో కూడా భద్రంగా లేని రోజుల్ని చూశాం. రోడ్డుమీదికి లాక్కొచ్చి మహిళల్ని కూడా అవమానపరుస్తుంటే చూస్తూ కూర్చున్నాం.. ఇంకానా ఇకపై చెల్లదు… అన్నారు. ఎలక్షన్లకు ముందు గబ్బర్‌ సింగ్‌.. ఎలక్షన్ల తర్వాత రబ్బర్‌ సింగ్‌ .. ఎక్కడ దాక్కున్నావయ్యా నువ్వు అని రోజా పిలిచిందో లేదో ఇదిగో వచ్చేశారు. ఎప్పుడూ కోపం రాని వాడికి కోపం వస్తే.. కొండలే పిండైపోతాయ్. మాది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదు.. అనేది పవన్ ఇచ్చిన మాస్ వార్నింగ్.

మళ్లీ వస్తారా.. వచ్చాక నరుకుతారా.. అవన్నీ పగటి కలలే. మరో 15 ఏళ్లు పాటు కూటమిదే రాజ్యం.. మేం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నిస్తుంటే మీరు విచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తారా..? మారుస్తుంటే మేం చూస్తుంటామా నోవే అంటున్నారు డిప్యూటీ సీఎం. రౌడీయిజానికి రోజులు చెల్లిపోయాయ్.. పోలీసులంటే భయపడే రోజులొచ్చేశాయ్ అన్నారు పవన్. రప్పారప్పా రచ్చకు ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశారు డిప్యుుటీ సీం. పీకే కామెంట్లకు వైసీపీ నుంచి కౌంటర్లూ పడతాయ్. సో.. రప్బారప్పా రాజకీయం కంటిన్యూస్ అన్నమాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..