Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు.. ఏడాదిలో నెరవేర్చిన లక్ష్యాలు, జరగాల్సిన ప్రగతిపై చర్చ

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు.. ఏడాదిలో నెరవేర్చిన లక్ష్యాలు, జరగాల్సిన ప్రగతిపై చర్చ

Ravi Kiran
|

Updated on: Jun 23, 2025 | 6:08 PM

Share

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా.. ఇవాళ వార్షికోత్సవ సభను నిర్వహిస్తోంది. జూన్ 12 నే ఈ వేడుకలు నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ అదేరోజు అహ్మదాబాద్‌లో విమానప్రమాదంతో వాయిదా పడింది. మరి, ఇవాళ వార్షికోత్సవ సభను ఏపీ ప్రభుత్వం తొలి అడుగు పేరుతో వేడుకలు జరుపుతోంది.

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సోమవారం వేడుకలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనుక భాగంలో ఈ వేడుకకు వేదిక సిద్ధమైంది. ఇది తొలి ఏడాది సభ మాత్రమే కాదు, ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రదర్శన, ఒక రాజకీయ మానిఫెస్టో పునః సమీక్ష.
ఏడాది పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, నెరవేర్చిన లక్ష్యాలు, ఇంకా జరగాల్సిన ప్రగతిపై ఈ వేదికపై చర్చిస్తారు. ఈ సభలో అత్యంత ఆకర్షణీయంగా నిలవనున్న అంశం.. సీఎం చంద్రబాబు సమీక్ష. వేదికపై బహింరంగానే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నారు. ఏడాదిలో ఏం సాధించారు? ఎక్కడెక్కడ విఫలమయ్యారు? భవిష్యత్తులో లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలను మంత్రులతో పాటు అధికారులపైనా సంధించబోతున్నారు సీఎం చంద్రబాబు. ప్రజల జీవితాల్లో పథకాల ప్రభావం, పథకాల అమలు రేటు, నిధుల వినియోగం, జిల్లా వారీగా ఫలితాలు, ఉన్నతాధికారుల పాలనా సమర్థతపై రివ్యూ చేస్తారు సీఎం చంద్రబాబు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం బహిరంగంగా పరీక్ష రాయబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..