AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Fever: పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు

ఎక్కడచూపినా జ్వరం, ఒళ్లునొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు మంచాన పడుతున్నాయి. పల్లెనుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో బాధితులు అధికమవుతున్నారు. వారంతా వైద్యం కోసం ఆసుత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో పలు చోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. దోమల దాడి కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డెంగ్యూ ఫీవర్ పేరుతో. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను విలువు దోపిడీ చేస్తున్నాయి.

Dengue Fever: పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు
Dengue
M Sivakumar
| Edited By: |

Updated on: Sep 23, 2023 | 7:35 PM

Share

ఎక్కడచూపినా జ్వరం, ఒళ్లునొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు మంచాన పడుతున్నాయి. పల్లెనుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో బాధితులు అధికమవుతున్నారు. వారంతా వైద్యం కోసం ఆసుత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో పలు చోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. దోమల దాడి కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డెంగ్యూ ఫీవర్ పేరుతో. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను విలువు దోపిడీ చేస్తున్నాయి. తరుచూ కురుస్తున్న వర్షాలకు, మరోవైపు వేసవిని తలపించే ఎండలు.. వాతావరణంలో మార్పులు రావడంతో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. నెలరోజుల నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. విష జ్వరాల బారిన పడిన వారిలో పిల్లలు అధికంగా ఉన్నారు.

ప్రధానంగా డెంగీ లక్షణాలతో వస్తున్న వారు అధికంగా ఉంటున్నారు. ఆ తర్వాత స్థానంలో మలేరియా కేసులు ఉంటున్నాయి. జిల్లా వైద్యారోగ్య అధికారులు చెబుతున్న లెక్కలకు.. ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి రాని డెంగ్యూ కేసులు జిల్లాలో వందల సంఖ్యలోనే ఉంటాయని సమాచారం. ఎక్కువగా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ చికిత్స పొందడం వల్ల అవి సాధారణ అధికారిక లెక్కల్లోకి రావడం లేదంటున్నారు. జ్వరాలు ఈ ఏడాది ఇప్పటివరకు13,274 కేసులు నమోదైతే.. ఈ నెలలో ఇప్పటివరకు 1,325 కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ జ్వరాలు ఈ ఏడాది ఇప్పటివరకు 1,354 కేసులు నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 233 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం ప్రభుత్వ లెక్కలు మాత్రమే. ప్రైవేట్, కార్పొరేట్ గ్రామీణ వైద్యుల వద్ద వందల సంఖ్యలో రోగులు ప్రతిరోజు వైద్యసేవలు పొందుతూ ఉంటారు. టైఫాయిడ్, ఇతర విష జ్వరాలు వచ్చే సరికి వర్షాకాలంలో ప్రతి నెలా సగటున మూడు వేల వరకు కేసులు నమోదు అవుతాయి. ఇటీవల కాలంలో మలేరియా కేసులు కొంతమేర తగ్గి ప్రజలు డెంగీ బారిన పడుతున్నారు. మరోవైపు ఆస్పత్రుల నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులతో పాటు డెంగ్యూ పేరుతో అన్ని రకాల రక్త పరీక్షలు చేసి రోగుల వద్ద వేలల్లో వసూలు చేస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్స్ కౌంట్ తోపాటు మరిన్ని పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగ్యూ పరీక్షకు రూ.750 నుంచి రూ.1500, మలేరియా, టైఫాయిడ్ పరీక్షకు రూ.400 నుంచి రూ. 800 వరకు 3 వసూలు చేస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మరో రూ.1500 లాగేస్తున్నారు. మొత్తంగా జ్వర బాధితులకు పరీక్షలకే సుమారు రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ఖర్చవుతోంది. డాక్టర్ ఫీజు, మందులు, ఇతర ఖర్చులకు మరో రూ.5 వేల భారం పడుతోంది. 173 వైద్య ఖర్చులు… రూ.వెయ్యి దాటిన వ్యాధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. కానీ, క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. వాస్తవంగా నైట్‌వర్క్ ఆసుపత్రులు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అతికొద్ది ఆసుపత్రిలు మాత్రమే ఈ సేవలు అందిస్తుండగా, అధిక శాతం రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. వర్గాలు అధికంగా పడుతుండటంతో పారికుర్యం అస్తవ్యస్తంగా మారింది. కొద్దిపాటి జల్లులకే గ్రామాల్లోని కాలువల్లో ఉన్న మురుగు రోడ్లమీద ప్రవహిస్తోంది. మరోవైపు దోమల ఉధృతి పెరిగింది. ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ కోసం అరకొర చర్యలు మాత్రమే చేపడుతోంది. ఇంకోవైపు గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా పాలకవర్గాలు పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారణ అయిన కేసులనే వైద్యారోగ్య శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. బయట రక్త పరీక్ష కేంద్రంలో వచ్చే కేసులను నమోదు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో సక్రమంగా సేవలు అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాల్లో కూడా పరీక్షలు చేసి డెంగ్యూ అని చెప్పి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఐదు నుంచి పది రోజులపాటు ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకొని రోజుకి వేయి నుంచి రూ. 30 వేల వరకు రోగుల నుంచి పిండేస్తున్నారు. వాస్తవానికి పరీక్షల ధరలు తెలుపుతూ రక్త పరీక్షా కేంద్రాలలో బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ, చాలా రక్త పరీక్ష కేంద్రాలలో ఇవి కనిపించడం లేదు. రోగుల బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.