Andhra Pradesh: “విశాఖ వందనం” పేరుతో సీఎం జగన్‌కు జేఏసీ స్వాగతం
విశాఖలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి నివాసాన్ని విజయదశమికి విశాఖకు మారుస్తానన్న వెంటనే విశాఖలో హడావుడి ప్రారంభం అయింది. ఒక వైపు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తే మరొక వైపు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాట్లు ప్రారంభించింది. దీంతో ఈరోజు విశాఖలో ఒక వైపు వికేంద్రీకరణ జేఏసీ సమావేశం, మరొక వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.

విశాఖలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి నివాసాన్ని విజయదశమికి విశాఖకు మారుస్తానన్న వెంటనే విశాఖలో హడావుడి ప్రారంభం అయింది. ఒక వైపు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తే మరొక వైపు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాట్లు ప్రారంభించింది. దీంతో ఈరోజు విశాఖలో ఒక వైపు వికేంద్రీకరణ జేఏసీ సమావేశం, మరొక వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రాజధాని గర్జన తర్వాత ఒక్కసారిగా దాదాపుగా కనుమరుగైన వికేంద్రీకరణ జేఏసీ విశాఖలో ఒక్కసారిగా మళ్లీ తెరపైకి వచ్చింది. ముందుగా రాజధానిపై ఉన్న అపోహలను తొలగించడం, రాజధాని వస్తే విశాఖలో ప్రశాంతత పోతోందంటూ జరుగుతున్న చర్చ పై ప్రతిస్పందించడం, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా చర్చాఘోస్టులు నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ నిర్ణయించుకుంది.
ముఖ్యంగా విశాఖ వందనం పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేయాలని అభిప్రాయపడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ అందుకు తగ్గట్టుగా అక్టోబర్ 15 నుంచి వరుసగా కార్యక్రమాల రూపకల్పనకు సిద్ధమవుతోంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్తరాంధ్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రాకను ఆహ్వానిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. సమావేశానికి వర్తక వ్యాపార ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు వైవి సుబ్బారెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ కూడా హాజరయ్యారు. సమావేశ వివరాలను వెల్లడించిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ముఖ్యమంత్రి విశాఖ రాకను ఉత్తరాంధ్ర ఘనంగా ఆహ్వానిస్తుందంటూ అందుకు తగ్గట్టుగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.అదే సమయంలో రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యాజ్యంలోనూ ఇంప్లీడ్ అవ్వాలని వికేంద్రీకరణ జేఏసీ నిర్ణయం తీసుకున్నట్టుగా జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ వివరించారు. విశాఖకి రాజధాని ఎందుకు కావాలి, అమరావతి కంటే విశాఖకి రాజధాని రావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, లాంటి అంశాలని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామని లజపతిరాయ్ వివరించడం విశేషం. వీలైనంత త్వరలో సుప్రీంకోర్టులో ఇంప్లీడి పిటిషన్ వేయడానికి సన్నద్ధమవుతోంది జేఏసీ. డిసెంబర్ 19వ తేదీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుంది. ఈలోగా ఇంప్లిడ్ పిటిషన్ వేయాలని జేఏసీ నిర్ణయించింది.

జేఏసీలో పాల్గొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకి అద్భుతమైన ప్రయోజనాలు రాజధాని ద్వారా కలగబోతున్నాయని ప్రధానంగా ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయని, విశాఖ ఒక గ్రోత్ ఇంజన్‌లాగా మారి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన సంపద సృష్టిస్తుందన్నారు. అదే సమయంలో రాజధాని విశాఖకు వస్తే విశాఖ ప్రశాంతత పోతుందని అంటూ చేస్తున్న విష ప్రచారం పైన దృష్టి సారించాలని జేఏసీకి సూచించినట్టు ఆయన తెలిపారు. అన్ని వర్గాలలో చర్చించి అందర్నీ భాగస్వామ్యం చేస్తూ ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చేలాగా చర్యలు తీసుకోవాలని జేఏసీనీ కోరినట్టు సుబ్బారెడ్డి వివరించారు. మరోవైపు ముఖ్యమంత్రి నివాసం విశాఖకు మారుతున్న నేపథ్యంలో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి పర్యటించారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, ఇతర అధికారులతో వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎస్ జవహర్ రెడ్డి. విశాఖ లో మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రణాళిక ల పై చర్చించామని.. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలుకోసం కొన్ని సూచనలు చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామం అని, 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటన్న కే ఎస్ జవహర్ రెడ్డి ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రికెట్ ఆఫ్ ఇండియా టోర్నమెంట్ బహుమతి ప్రదానం కోసం విశాఖ వచ్చానన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం




