Rain Alert: తీరం దాటిన వాయుగుండం.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సుమారు సాయంత్రం5గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6గంటల్లో గంటకు 17కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయంకి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సుమారు సాయంత్రం5గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6గంటల్లో గంటకు 17కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయంకి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా.. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా గంటకు 55-65 కి.మీ వరకు ఈదురుగాలులు వీస్తాయి.. కాగా.. దక్షిణ ఒడిశా తీరంపై వాయుగుండం కేంద్రీకృతం అయిందని.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శుక్రవారం: ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కాగా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిశీలించాలి.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కృష్ణా ప్రకాశం బ్యారేజి వద్ద 3.76 లక్షల క్యూసెక్కులు, గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.82 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
