Watch Video: అశ్వాలపై విశ్వాసం.. ప్రతి ఏటా ఘనంగా గుర్రాల పార్వేట
Maddikera Dussehra: రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి,రాజులనాటి రాజరిక ఆచార సంప్రదాయాలు మాత్రం నేటికీ అమలులో ఉన్నాయి అనడానికి ఈ గుర్రాల పారువేటనే మనకు నిదర్శనం.అలనాటి ఆచారా సంప్రదాయాలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా వందల సంవత్సరాల నుండి పూర్వీకుల ఆచార సంప్రదాయాలను నేటికీ దసరా పండుగ రోజున కొనసాగిస్తున్న యాదవ రాజుల వంశీకులు వివరాలు తెలుసుకుందాం పదండి.

కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో యాదవ రాజులు గా పిలవబడే రాజవంశీకులు గుర్రాల పారువేట అత్యంత ఆకర్షణీయంగా అలనాటి రాజరికం ఇప్పటికీ కనిపిస్తుంది. అసలు ఈ గుర్రాల పారువేట అంటే ఏమిటి.. సిసలైన గుర్రాల పారువేట గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ప్రతి ఏటా దసరా పండుగ రోజున ఈ గుర్రాల పారువేట ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్వం అలనాటి రాజవంశీకులకు చెందిన పెద్ద నగిరి, చిన్న నగిరి, వేమన నగిరి,లకు చెందిన మూడు రాజరిక కుటుంబాలు విజయదశమి దీనిని నిర్వహిస్తారు.
వీరు మద్దికేరకు సమీపంలో వీళ్ల పెద్దలు నిర్మించినటువంటి బొజ్జనాయన పేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయములో పూజలు చేసుకొని.. గుర్రాలపపై స్వారీగా బయల్దేరుతారు.ఈ ముగ్గురి రాజకుటుంబీకులలో ఎవరు అయితే ముందుగా మద్దికేరకు చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. గుర్రపు స్వారీ లో విజేత గా గెలిస్తే ఏముంది అనుకుంటున్నారా, ఆ విజయం సాధించిన తర్వాతనే ఉంది మజా అంతా, గుర్రపు స్వారీ లో గెలిచిన వ్యక్తి కి రాజు దుస్తులు ధరించి చేతిలో ఖడ్గం,గుర్రం పక్కన రాజభటులు రాజరిక ఆచార సంప్రదాయాలతో గుర్రం మీద మద్దికేర గ్రామంలో ఊరేగింపు చేస్తూ పూలమాలలతో తో స్వాగతం పలుకుతారు.
గతంలో రాజులు ఎలా ఉండేవారో.. అలానే విజెయగా గెలిచిన వ్యక్తిని రాజరిక మర్యాదలలో మద్దికేర గ్రామంలో ఊరేగింపు చేస్తారు. యాదవ వంశీయులు,యాదవ రాజు వంశీయులు గుర్రాలపై కూర్చొని స్వారీ చేస్తూ తమ రాచరిక ఠీవిని ప్రదర్శిస్తారు. యాదవ రాజులు గుర్రాలపై తరలి వెళ్ళే సమయంలో వీరికి మద్ది అనే కులస్తులు సైన్యము వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా ఉంటారు. ఈ గుర్రాల పారువేటను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు మద్దికేరకు తరలివస్తారు.
ఈ యాదవ రాజులు గుర్రాల పారువేట కార్యక్రమం అలనాటి సంప్రదాయాన్ని నేటికీ ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు సాయంత్రము సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ వేడుకలు గుర్రపు స్వారీలు పాల్గొని రాజా వంశీకులు నెల రోజుల ముందు నుండి సిద్ధమౌతారు. గుర్రాలపై స్వారీ చేయడానికి లక్షలు వెచ్చించి మహారాష్ట్ర, కర్ణాటక ఇతర ప్రాంతాల నుండి గుర్రాలను కొనుగోలు చేసి,వాటికి శిక్షణ ఇచ్చి పారువేటకు సిద్ధం చేస్తారు.
ఈ సంవత్సరం విజేత వేమ నగరి రాజకుటుంబానికి చెందిన జదిల్ రాయుడు విజేతగా నిలిచారు. ఆయనను గుర్రంపై మద్దికేర గ్రామంలో భారీ ఊరేగింపు చేశారు.గుర్రాల పారువేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
