AP News: గుట్టుగా డెడ్ బాడీ దహనం.. మరణం వెనుక పెద్ద మిస్టరీ?

విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్‌కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

AP News: గుట్టుగా డెడ్ బాడీ దహనం.. మరణం వెనుక పెద్ద మిస్టరీ?
Dead Body Of Student Cremated In Visakhapatnam
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Nov 12, 2024 | 8:31 AM

విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్ కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కనీసం స్మశాన వాటిక నుంచైనా పోలీసులకు సమాచారం లేదు. ఆమె మరణం వెనుక గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆమెది ఆత్మ ‘హత్యే’ నా..?!

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ కు చెందిన భాగ్యశ్రీకి విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న ఏసుబాబు , వదిన వాగ్దేవి లతో కలిసి నివాసం ఉంటుంది. పారా మెడికల్ లో కార్దియాలాజీ కోర్స్ చదువుతూ కేజీహెచ్ లో శిక్షణ తీసుకుంటుంది. అన్నయ్య ఏసుబాబు ఆటో డ్రైవర్, వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది.

చలాకీగా ఉండి.. విగతాజీవిగా మారి..

ఎప్పుడూ చలాకీగా ఉండే భాగ్యశ్రీ ఏదో తేదీ రాత్రి మృతి ప్రాణాలకు కోల్పోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆమె అన్న, వదిన గుట్టు చప్పుడు కాకుండా యువతి మృతదేహాన్ని మూటకట్టారు. ఆటోలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగుల బెట్టి.. స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసి వచ్చారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. స్థానికులకు ఏమైందో తెలియనివ్వలేదు. ఇదే స్థానికులకు అనుమానం కలిగించిందని అంటున్నారు స్థానికులు.

అందుకే ఆ అనుమానం…

భాగ్యశ్రీ ఈనెల ఏదో తేదీన మృతి చెందిన తరువాత హుటాహుటిన దహన సంస్కారాలపై స్థానికుల అనుమానం కలిగింది. భాగ్యశ్రీ మృతిని కనీసం బయటకు పక్కనేయకుండా.. అడిగిన వారికి వందనాలు లేని సమాధానాలు చెప్పకుండా స్మశాన వాటికలో హడావుడిగా అంత్యక్రియలు చేయడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడూ చలాకీగా కళ్ళ ముందు ఉండే భాగ్యశ్రీ ఒక్కటిసారిగా విగత జీవిగా మారడం.. ఆమె మృతదేహాన్ని హుటాహుటిగా అంత్యక్రియలు చేసిన తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో స్థానికులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్నేహితుల ఆవేదన.. అనుమానం..

భాగ్యశ్రీ మృతితో తీవ్ర విషాదంలోకి వెళ్లారు ఆమె స్నేహితులు. భాగ్య, అఖిల దివ్య ఆమె ఇంటికి చేరుకుని విలపించారు. ఏసిపి నరసింహమూర్తి ఆధ్వర్యంలో గోపాలపట్నం పోలీసులు రంగాల్లో దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. భాగ్యశ్రీ క్లాస్మేట్స్ తో పాటు కుటుంబ సభ్యులను విచారించారు. అన్న, వదిన వేధింపులు తరచూ జరిగేవాని తమతో భాగ్య షేర్ చేసుకునేదని అన్నారు. భాగ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదాంటున్నారు ఆమె స్నేహితులు భాగ్య, అఖిల, దివ్య. భాగ్యశ్రీ మృతదేహాన్ని మూట కట్టి తరలించడం పైన తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

భాగ్యశ్రీ వదిన వెర్షన్ ఇలా…

అయితే.. భాగ్యశ్రీ వదిన వాగ్దేవి వర్షన్ మరోలా ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందని అంతోంది వదిన వాగ్దేవి. ఆ సమయంలో తన భర్త కూడా పనిమీద బయటే ఉన్నారని.. తాను కూడా నైట్ డ్యూటీ చేసి ప్రెగ్నెంట్ కావడంతో నీరసంగా ఉందని తల్లి ఇంటికి వెళ్లిపోయానని.. ఆ సమయంలో భాగ్యశ్రీ ఒంటరిగానే ఇంట్లోనే ఉందని చెబుతోంది వదిన వాగ్దేవి.

అందుకే అలా చేసాం.. మృతురాలి వదిన

భాగ్యశ్రీ స్నేహితులు ఆరోపణలపై స్పందించిన వాగ్దేవి.. తనకు పెళ్లయిన నాటి నుంచి తమ దగ్గరే భాగ్యశ్రీ ఉంటుందని.. కానీ ఆమెను పెంచుతున్నామని చెబుతోంది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ కాలేజీ చదివించడంతోపాటు.. పారామెడికల్ కోర్సు కు తానే 35 వేలు ఫీజు చెల్లించానని చెబుతోంది. తన భర్త ఆటో డ్రైవర్ గా, తాను పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నానని.. ఏ కష్టమన్నా నాతో భాగ్యశ్రీ షేర్ చేసుకునేదని ఆత్మహత్యకు గల కారణం తెలీదని అంతోంది. పరువు పోతుందని, పోస్టుమార్టం జరుగుతుందని భయపడి అంతిమ సంస్కారాలు చేసామని అంతోంది వాగ్దేవి.

మృతి మిస్టరిని తెలుస్తాం.. ఏసీపీ

అయితే.. భాగ్యశ్రీ మృతిపై స్థానికుల ఫిర్యాదులతో అనుమానస్పద మృతి కేసు నమోదు చేశారు గోపాలపట్నం పోలీసులు. సీన్ ఆఫ్ అపెన్స్ ను విసిట్ చేశారు. ఈ కేసులో భాగ్యశ్రీ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు పోలీసులు. సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ తో సేకరిస్తున్నామని.. భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా..? లేక ఎవరైనా హత్య చేశారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఆత్మహత్య చేసుకుంటే కారణం ఏంటి..? హత్య జరిగితే దానికి కారకులు ఎవరు అనేది తెలుస్తామన్నారు ఏసీపీ నర్సింహామూర్తి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాటి కాపరి తీరుపైనా..

అయితే.. భాగ్యశ్రీ మృతదేహం ఆటోలో తరలించడం.. ఆ వెంటే పెట్రోల్ తీసుకెళ్లడం తో పాటు దహనం చేసిన స్మశాన వాటిక సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాగ్యశ్రీ మృతికి అసలు కారణమేంటనేది ఇంకా తేలాల్సి ఉంది. చూడాలి మరి పోలీసులు విచారణలో ఏ కోణం బయటపడుతుందో..? స్థానికులు, పోలీసుల అనుమానాలకు ఎటువంటి కంక్లూజన్ లభిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్