AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: వానలు బాబోయ్ వానలు.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

AP Rains: వానలు బాబోయ్ వానలు.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు
Ap Rains
Ravi Kiran
|

Updated on: Oct 15, 2024 | 11:06 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ఉత్తరతమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ.. రేపటికి తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి.

ఇది చదవండి: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడన్నారు.. కట్ చేస్తే.. 3 డకౌట్‌లతో టీమిండియాకు ఎగనామం పెట్టాడు.. ఎవరంటే?

ఇక అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బయటికొచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యార వాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు-ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల హెచ్చరికతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో మూడ్రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, అధికారులు మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు.

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త