AP Rains: తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు కుండబోత.. బలమైన ఈదురుగాలులు.!

బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌‌గా మారనుంది. వాయుగుండం ప్రభావంతో కేరళలో జోరు వానలు కురుస్తున్నాయి. ఏపీలో పలు చోట్ల కుండపోత వానపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP Rains: తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు కుండబోత.. బలమైన ఈదురుగాలులు.!
Rain Alert
Follow us

|

Updated on: May 26, 2024 | 7:00 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 17కిలో మీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. తుఫానుకు రెమాల్‌గా నామకరం చేశారు. ఇవాళ ఉదయం తీవ్ర తుఫాన్‌గా రెమాల్ మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అలాగే ఈ రోజు రాత్రికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను గంటకు 120 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉందని.. గంటకు 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో ఏపీలోని ఉప్పాడ కాకినాడ బీచ్‌లో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉదయం నుంచి సముద్రపు అలలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తీవ్ర అల్పపీడనంగా మారిందన్న అధికారుల సమాచారంతో తీర ప్రాంతలోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని విజయవాడతో పాటు పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది. ఇక రెమాల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌‌తో కేరళను భారీ వర్షాలు, ఈదురుగాలులు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు 11మంది చనిపోయారు. తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకుళం సహా.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ అధికారులు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలపై కేరళ సీఎం పినరయ్‌ విజయన్ సమీక్ష జరిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.